Homeఆంధ్రప్రదేశ్‌Quantum Valley In Amaravati: చంద్రబాబుకు హ్యాట్సాఫ్.. క్వాంటం వెనుక ఇంత కథ ఉందా?

Quantum Valley In Amaravati: చంద్రబాబుకు హ్యాట్సాఫ్.. క్వాంటం వెనుక ఇంత కథ ఉందా?

Quantum Valley In Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి కొత్త కళ వచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రణాళిక వేశారు. అందులో భాగంగా ప్రపంచం చూసే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో ఐటీ పరంగా హైదరాబాద్ కు చంద్రబాబు గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే మాదిరిగా అమరావతిని నేలపాలని చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆలోచిస్తున్న క్వాంటం టెక్నాలజీని ముందుగానే అమరావతిలో తీసుకొచ్చి.. దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది చంద్రబాబు ప్రణాళిక. ఈరోజు ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతికి ఇదో మణిహారంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో అమరావతికి కొత్త కళ రావడం ఖాయం.

* సరికొత్త విప్లవం..
క్వాంటం కంప్యూటింగ్( Quantum computing) అనేది కంప్యూటర్ టెక్నాలజీలో ఓ సరికొత్త విప్లవం. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లలో చాలావరకు 64 బిట్ తో పనిచేస్తాయి. తొలుత 32 బిట్ ఉండేది. క్రమేపి దాని బలం పెంచుతూ 64 బిట్ కు దాని స్థాయిని పెంచారు. అయితే దానికి మించి ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ పనిచేయనుంది. ఇది చాలా వేగవంతమైనది. ఒకేసారి కొన్ని కోట్ల పనులను కంప్యూటర్లు వేగంగా చేసేందుకు.. క్వాంటం కంప్యూటింగ్ ఎంతగానో దోహదపడనుంది. అయితే టెక్నాలజీ రంగంలో క్వాంటం అనేది సరికొత్త విప్లవం. దానిని ముందుగానే గుర్తించారు సీఎం చంద్రబాబు. ఫుల్ ఫోకస్ చేశారు. ఐటీ రంగం అనేది పాతది. అందుకే కొత్తగా క్వాంటం కంప్యూటింగ్ ను ఒడిసి పట్టుకున్నారు చంద్రబాబు.
* దేశంలోనే మొదటి 133 క్యూబిట్ కంప్యూటర్ ఇది. దీనిని తొలిసారిగా అమరావతికి తెస్తారు.
* క్వాంటం వ్యాలీ నిర్మాణంలో IBM, TCS, L&T సంస్థలు పాల్గొంటాయి.
* 50 ఎకరాల్లో ఈ వ్యాలీలో ఉంది. ఇందులో క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, సెన్సార్, ఫైనాన్స్, డిఫెన్స్, హెల్త్ కేర్ రంగాల్లో ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి.
* ఆగస్టు నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం. డిసెంబరు నాటికి క్వాంటం కంప్యూటర్ని తెస్తారు.
* ప్రస్తుతం బోస్టన్, సింగపూర్ వంటి ప్రాంతాల్లోనే క్వాంటం హబ్ లు ఉన్నాయి. అమరావతి కూడా వాటి సరసన చేరనుంది.
* ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే దానిని అందిపుచ్చుకోవాలి అన్నది చంద్రబాబు ప్రణాళిక.

* ఈరోజు శంకుస్థాపన
అమరావతి రాజధాని లో ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper