Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Varaprasad Garu OTT: ఓటీటీలో 10 నిమిషాల సరికొత్త సన్నివేశం..'మన శంకర వరప్రసాద్...

Mana Shankara Varaprasad Garu OTT: ఓటీటీలో 10 నిమిషాల సరికొత్త సన్నివేశం..’మన శంకర వరప్రసాద్ గారు’ ఫ్యాన్స్ కి పండగే!

Mana Shankara Varaprasad Garu OTT: థియేటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం , ఒప్పందం ప్రకారం నాలుగు వారాలు పూర్తి అయిన తర్వాత ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ‘జీ5’ సంస్థ రికార్డు స్థాయి ప్రైజ్ తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు […]

Mana Shankara Varaprasad Garu OTT: థియేటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం , ఒప్పందం ప్రకారం నాలుగు వారాలు పూర్తి అయిన తర్వాత ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ‘జీ5’ సంస్థ రికార్డు స్థాయి ప్రైజ్ తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ నెల 11వ తేదీ నుండి ‘జీ5’ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికే థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రెండు మూడు సార్లు చూసేశారు. ఇప్పుడు మరోసారి ఓటీటీ లో కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి అభిమానుల కోసం ఇప్పుడు ఒక గుడ్ న్యూస్.

అదేమిటంటే ఈ సినిమాలో అనేక కామెడీ సన్నివేశాలు సినిమా రన్ టైం లెంగ్త్ దృష్టిలో పెట్టుకొని తొలగించాల్సి వచ్చిందట. ఈ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జత చేసి విడుదల చేయబోతున్నారట. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, VT గణేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ కామెడీ సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక సన్నివేశం లో చిరంజీవి VT గణేష్ గొంతు ని ఇమిటేట్ చేస్తాడట, అది చాలా ఫన్నీ గా ఉంటుందని సమాచారం. అదే విధంగా లెజండరీ బ్రహ్మానందం కాంబినేషన్ లో కూడా మెగాస్టార్ చిరంజీవికి కొన్ని కామెడీ సన్నివేశాలు ఉన్నాయట. అవి కూడా ఈ వెర్షన్ లో జత చేయనున్నారు. అలా దాదాపుగా 10 నిమిషాల ఫుటేజీ ని చూడబోతున్నాం అన్నమాట. వీటికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. వాస్తవానికి ఈ సన్నివేశాలను మూడవ వారంలో థియేట్రికల్ వెర్షన్ కి జత చెయ్యాలని చూశారట మేకర్స్.

కానీ ఎందుకో అది కుదర్లేదు. కనీసం యూట్యూబ్ లో అయినా విడుదల చేద్దామని అనుకున్నారు. చివరికి ఆ ఆలోచన కూడా విరమించుకొని నేరుగా ఓటీటీ ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ కలిగించారు. మరి ఈ సన్నివేశాలకు ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం ఇప్పటి వరకు 296 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అతి త్వరలోనే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది. నాలుగు సినిమాలతో పోటీ పడి ఈ రేంజ్ గ్రాస్ ని సొంతం చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. సోలో రిలీజ్ అయ్యుంటే కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమాల రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper