Homeఆంధ్రప్రదేశ్‌Magunta Srinivasulu Reddy: వైసీపీ నుంచి సొంత గూటికి.. టీడీపీలోకి కీలక నేత!

Magunta Srinivasulu Reddy: వైసీపీ నుంచి సొంత గూటికి.. టీడీపీలోకి కీలక నేత!

Magunta Srinivasulu Reddy: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు పొత్తుల అంశం సైతం క్లైమాక్స్ కు చేరుకుంది. దీంతో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలో చేరేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై సైతం స్పష్టతనిచ్చారు. కొద్ది రోజుల కిందట ఆయన వైసీపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు. జగన్ ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎంపీగా గెలిచారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడుగా మారారు. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ వెన్నంటి నడిచారు. అయితే ఆయన కుమారుడు రాఘవరెడ్డి అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారు. కొద్దిరోజుల పాటు జైలులో ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. ఇదే విషయం జగన్ కు మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పగా… ఆయన సానుకూలంగా స్పందించలేదు. పైగా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాయబారం నడిపారు. అయినా వర్కౌట్ కాలేదు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును జగన్ ప్రకటించారు. దీంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. టిడిపిలో చేరేందుకు నిర్ణయించారు. సరైన వేదిక చూసి టిడిపిలో చేరుతామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు.

మాగుంట కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఎక్కువకాలం ఆ కుటుంబం ఎంపీగా ప్రాతినిధ్యం వహించింది. 2014 ఎన్నికల తర్వాత మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపిలో చేరారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కానీ గత ఎన్నికలకు ముందు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడు మరోసారి టిడిపిలోకి వస్తున్నారు. మాగుంట చేరికతో ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి టిడిపి తరఫున నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. జగన్ ప్రభంజనంలో సైతం ఈ జిల్లాలో మెరుగైన ఫలితాలను టిడిపి సాధించింది. ఇప్పుడు మాగుంట చేరికతో దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కూటమి అభ్యర్థులు గెలుచుకుంటారని అంచనాలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా రంగంలోకి దించింది. అయితే అది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇష్టం లేదు. ఈ తరుణంలో టిడిపి ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఇక్కడ గట్టి ఫైట్ ఉంటుందన్నది ఒక అంచనా. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వంపై వ్యతిరేకతతో టిడిపికే మొగ్గు కనిపిస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper