Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Daughter Kranthi: కర్మ ఎవరిని విడిచి పెట్టదు.. ముద్రగడ కుమార్తె చెప్పిన కథ

Mudragada Daughter Kranthi: కర్మ ఎవరిని విడిచి పెట్టదు.. ముద్రగడ కుమార్తె చెప్పిన కథ

Mudragada Daughter Kranthi: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గత నెలలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతదేహాన్ని చూసేందుకు కూడా కుమార్తె క్రాంతికి అప్పట్లో అనుమతించలేదు. చివరకు పోలీసుల సాయంతో ఆమె తన తండ్రి కడసారి చూపునకు నోచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రి ముద్రగడను జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారని.. కనీస స్థాయిలో కూడా గుర్తింపు ఇవ్వలేదని.. అటువంటి జగన్ […]

Mudragada Daughter Kranthi: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గత నెలలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతదేహాన్ని చూసేందుకు కూడా కుమార్తె క్రాంతికి అప్పట్లో అనుమతించలేదు. చివరకు పోలీసుల సాయంతో ఆమె తన తండ్రి కడసారి చూపునకు నోచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రి ముద్రగడను జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారని.. కనీస స్థాయిలో కూడా గుర్తింపు ఇవ్వలేదని.. అటువంటి జగన్ కోసం తన కుటుంబ సభ్యులు ఎందుకు అంతలా పరితపిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మ ఎవర్ని విడిచిపెట్టదని కూడా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. తన తండ్రి ముద్రగడను తొక్కేసారని కూడా జగన్ పై ఆమె ఆరోపణలు చేశారు.

* చివరిగా వైసీపీలోకి..
2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారని అంతా భావించారు. సంప్రదింపులు కూడా జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ నుంచి అంత సానుకూలత రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కార్యరూపం దాల్చలేదు. వెంటనే ముద్రగడ తన కుమారుడిని తీసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేనలో చేరేందుకు సిద్ధపడ్డారు ముద్రగడ కుమార్తె క్రాంతి. కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ వద్దని వారించారు. తండ్రిని విభేదించి జనసేనలో చేరడం అనేది మంచిది కాదు అని తిప్పి పంపారు. అయినా సరే క్రాంతి జనసేనకు మద్దతుగా పనిచేశారు. ఫలితాలు వచ్చిన తరువాత క్రాంతి నేరుగా జనసేనలో చేరారు. జనసేన నేతగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ముద్రగడను కలిసేందుకు వెళ్లిన కుమార్తెను కుటుంబ సభ్యులు అప్పట్లో అడ్డగించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు కూడా ఆమెను ఇంట్లోకి రానివ్వలేదన్న వార్తలు వచ్చాయి. కానీ ముద్రగడ మరణంతో మృతదేహాన్ని కడసారి చూసేందుకు వెళ్లిన క్రాంతికి అడ్డంకులు ఎదురయ్యాయి. చివరకు పోలీసుల సాయంతో దూరం నుంచి చూసి వెనుతిరి గారు.

* తండ్రిని వాడుకున్నారు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేస్తూ.. ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని వాడుకున్నారని.. తన తండ్రి మూలంగా రాజకీయ లబ్ధి పొందారని.. కానీ ఒక్క పదవి కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతం అవుతూ చెప్పారు. అటువంటిది తన కుటుంబ సభ్యులు ఎందుకో అంత తపన పడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి లెగసీని వాడుకున్న జగన్.. ఎంత మాత్రం న్యాయం చేయలేదని.. కర్మ ఎవ్వర్నీ విడిచి పెట్టదు అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by @kranthi_barlapudi_followers

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper