Homeటాప్ స్టోరీస్ACwO DwOTS 333: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు.. ధర, ఫీచర్లు ఎలా...

ACwO DwOTS 333: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.

ACwO DwOTS 333:  ఈ కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చిన ఇయర్ బడ్స్ లో బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇవి పూర్తిగా బడ్జెట్ ధరలో లభిస్తాయి. పైగా ఇవి వైర్లెస్ ఇయర్ బడ్స్.. రోజువారి వాడకానికి.. ప్రయాణాలకు. గేమింగ్ కు ఉపయోగపడతాయి. 48 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఇది చుట్టుపక్కల ఉండే అనవసరమైన శబ్దాలను రాకుండా అడ్డుకుంటుంది. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా […]

ACwO DwOTS 333:  ఈ కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చిన ఇయర్ బడ్స్ లో బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇవి పూర్తిగా బడ్జెట్ ధరలో లభిస్తాయి. పైగా ఇవి వైర్లెస్ ఇయర్ బడ్స్.. రోజువారి వాడకానికి.. ప్రయాణాలకు. గేమింగ్ కు ఉపయోగపడతాయి.

48 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)

ఇది చుట్టుపక్కల ఉండే అనవసరమైన శబ్దాలను రాకుండా అడ్డుకుంటుంది. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వచ్చే ఇంజన్ శబ్దం.. ఇతర శబ్దాలను వినపడకుండా చేస్తుంది. మీరు విన్న సంగీతం లేదా క్లాస్ మాత్రమే స్పష్టంగా వినిపించేలాగా చేస్తుంది.

120 గంటల భారీ ప్లే టైం

చార్జింగ్ కేస్ తో పోస్ట్ చూస్తే ఈ ఏకంగా 120 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి వెళ్తుంటే, వారానికి పైగా వీటికి చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల వాడినా దాదాపు నెలరోజుల పాటు పనిచేస్తుంది.

Hexa Mics& AI – ENC

ఇందులో మొత్తం ఆరు మైక్రోఫోన్లు ఉంటాయి. ఒక్క బడ్ లో మూడు చొప్పున మైక్రోఫోన్లు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో ఉంటుంది. ఉదాహరణకు మీరు కూరగాయల మార్కెట్ లాంటి ప్రశాలకు వెళ్ళినప్పుడు. ఎవరికైనా ఫోన్ చేసినా.. అవతలి వ్యక్తికి మీ చుట్టు పక్కల ఉన్న శబ్దాలు వినిపించవు. మీరు మాట్లాడుతున్న మాటలు మాత్రమే చాలా క్లియర్ గా వినిపిస్తాయి.

డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ

ఒకే సమయంలో రెండు వేరువేరు పరికరాలకు బ్లూటూత్ ద్వారా దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ లాప్టాప్ లో సినిమా చూస్తున్నప్పుడు.. మీ మొబైల్ కు కాల్ వస్తే ఇయర్ బడ్స్ డిస్కనెక్ట్ చేయకుండానే నేరుగా మొబైల్ కాల్ మాట్లాడొచ్చు. కాల్ అయిపోగానే మళ్లీ లాప్టాప్ ఆడియో లోకి డివైస్ వెళ్ళిపోతుంది.

40 ఎంఎస్ – 50 ఎంఎస్ లో లాటేన్సి

ఆడియో, వీడియో మధ్య ఎలాంటి ఆలస్యం లేకుండా సౌండ్ వస్తుంది. ఉదాహరణకు మీరు బిజిఎంఐ లేదా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు శత్రువులు అడుగుల శబ్దాలు, గన్ షాట్స్ ఏమాత్రం ఆలస్యం కాకుండా రియల్ టైంలో స్పష్టంగా వినిపిస్తాయి.

10 ఎం ఎం బాస్ బూమ్ ఎక్స్ డ్రైవర్ & 3ఈ క్యూ మోడ్స్

సంగీతాన్ని ఇష్టపడే వారికి బరువైన బేస్, మూడు రకాలైన ఈక్వలైజర్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు మీకు నచ్చిన పాటను బట్టి ఎక్కువ బేస్ కావాలా లేదా కేవలం లోకల్ స్పష్టంగా వినపడాలా అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది

నీరు, చెమట నుంచి..

ఇది చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ ఇస్తుంది. ఉదాహరణకి మీరు జిమ్లో వర్కౌట్లు చేస్తూ విపరీతంగా చెమటలు చిందిస్తుంటే.. ఒకవేళ వర్షంలో తడిచినా ఇవి పాడుకావు.

వీటి ధర అమెజాన్ ప్రైమ్ లో 1999 కు లభిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద క్యాష్ బ్యాక్ కూడా లభిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper