Homeఆంధ్రప్రదేశ్‌Karumuri Nageswara Rao : కారుమూరి అరెస్టులో కొత్త కోణం..ఆ 35 రూపాయల కథ పెద్దగానే...

Karumuri Nageswara Rao : కారుమూరి అరెస్టులో కొత్త కోణం..ఆ 35 రూపాయల కథ పెద్దగానే ఉంది..

Karumuri Nageswara Rao : జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం విచ్చలవిడిగా సాగిపోయింది. వేలాది కోట్లు చేతులు మారిపోయాయని.. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ వంటి చట్టాలను కూడా తుంగలో తొక్కి దోచుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. అప్పట్లో ఈ మద్యాన్ని జే బ్రాండ్ అని టిడిపి నేతలు పిలిచేవారు. దానికి తగ్గట్టుగానే ఏపీ రాష్ట్రంలో మద్యం వ్యవహారం సాగింది. మద్యం వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు దాదాపు 37.7 కోట్లు […]

Karumuri Nageswara Rao : జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం విచ్చలవిడిగా సాగిపోయింది. వేలాది కోట్లు చేతులు మారిపోయాయని.. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ వంటి చట్టాలను కూడా తుంగలో తొక్కి దోచుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. అప్పట్లో ఈ మద్యాన్ని జే బ్రాండ్ అని టిడిపి నేతలు పిలిచేవారు. దానికి తగ్గట్టుగానే ఏపీ రాష్ట్రంలో మద్యం వ్యవహారం సాగింది.

మద్యం వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు దాదాపు 37.7 కోట్లు విలువైన ఆస్తులను అక్రమంగా సంపాదించారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ డబ్బుతో హైదరాబాదులోని అత్యంత ఖరీదైన స్థలాలు.. మైనింగ్లో హక్కులు.. అత్యంత విలువైన గడియారాలు.. వాహనాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వీటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో నాగేశ్వరరావు కోడలు వల్లూరు కీర్తి పేరు కూడా వినిపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇంకా ఆమెను అరెస్ట్ చేయలేదు. అయితే ఆమె పేరు మీద నిధులు జమ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ సంస్థ పేరు మీద 85% లాభాల షేరింగ్ చూపించే సంయుక్త భాగస్వామిగా చూపించే పత్రాలలో సంతకాలు ఉండడంతో.. ఆమె కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం నేరుగా డబ్బులు స్వీకరించిన వారికి సెక్షన్ 50 ప్రకారం నోటీసులు ఇస్తారు. విచారణ జరిపి వాంగ్మూలాలు సేకరిస్తారు. ఇటువంటి కేసులలో సాక్షాలను మాయం చేసే అవకాశం లేదా విచారణకు సహకరించని సందర్భంగా మాత్రమే మహిళలను ఈడి అధికారులు అరెస్ట్ చేస్తారు.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యవహారం కొనసాగిస్తారు. లేదా కార్పొరేట్ గవర్నెన్స్ అనే విధానాలను పాటిస్తారు. కారుమూరి కుటుంబ సభ్యులు మాత్రం కార్పొరేట్ దిగ్గజాలకే కొత్త పాఠం నేర్పించారు..

35 రూపాయల చొప్పున చెల్లించారు..

మద్యం కంపెనీల నుంచి సరుకును రవాణా చేసే లారీలకు కిలోమీటర్కు 13 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అయితే కారుమూరి రవాణా బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆయనకు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 35 రూపాయలు చెల్లించారు. సుదర్శన కన్స్ట్రక్షన్స్.. బూమ్ బూమ్.. ప్రెసిడెంట్ మెడల్.. ఇలా అన్ని సరఫరా చేసి.. అద్భుతాలను సృష్టించారు కారుమూరి. ఇలా అక్రమాలకు పాల్పడి కోట్ల నగదును సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఇక ఈ వ్యాపారంలో కారుమూరి ప్లానింగ్ చైర్మన్గా.. అతడి అబ్బాయి మేనేజింగ్ డైరెక్టర్.. కోడలు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా కొనసాగారు.. ఈడి ఇప్పుడే తవ్వడం మొదలు పెట్టింది. ఇకపై ఈ వ్యవహారం గురించి మరిన్ని సంచలన విషయాలు తెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper