Smartphones buying guide 2026: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్లో ఇప్పుడు వందలాది మోడల్స్, భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనసులతో అద్భుతమైన ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే ధర తగ్గిందని.. ఫీచర్లు అదిరిపోతున్నాయని.. వెంటనే ఫోన్ కొనుగోలు చేస్తే.. ఆ తర్వాత బాధపడక తప్పదు. ముఖ్యంగా ప్రస్తుతం కొత్త ఫోన్ కొనాలి అంటే కచ్చితంగా కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి.
ఎంత బడ్జెట్ పెట్టాలి.. కెమెరా పిక్సెస్ మాత్రమే చూడాలా..RAM ఎక్కువైతే ఫోన్ బెస్ట్ అయినట్టేనా.. బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉండాలి..5జీ ఉంటే సరిపోతుందా.. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే స్మార్ట్ ఫోన్ కొనే ముందు తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే.
కెమెరా మాత్రమే కాదు
200 MP.. 108 MP,. 64 MP అంటూ కెమెరా నెంబర్లను చూసి చాలామంది ఫోన్ కొనేస్తూ ఉంటారు. కానీ ఫోటో మంచిగా రావాలి అంటే మెగాపిక్సల్స్ ఒకటే కారణం కాదు. సెన్సార్ నాణ్యత.. ఓ ఐ ఎస్, ఇమేజ్ ప్రాసెసింగ్, హెచ్ డి ఆర్, నైట్ ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ కెపాసిటీ వంటి అంశాలు కూడా చాలా ముఖ్యం.
RAM ఎక్కువగా ఉందని
12 జిబి లేదా 16 జిబి రామ్ ఉందంటే అది బెస్ట్ ఫోన్ అనుకోవడం మరో పొరపాటు. రోజువారీ వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ బ్రౌజింగ్ వంటి పనులకు భారీ RAM అవసరం ఉండదు.. ఫోన్ ప్రాసెస్, RAM రకం, స్టోరేజీ, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా పని తీరుపై ప్రభావం చూపిస్తాయి.
ప్రాసెసర్ పేరు మాత్రమే చూసి కొనొద్దు
స్నాప్ డ్రాగన్, మీడియా టెక్, Exynos వంటి పేర్లు కనిపించగానే నిర్ణయం తీసుకోవడం అసలు మంచిది కాదు. ఓకే బ్రాండ్ కి సంబంధించిన వేర్వేరు ప్రాససర్ల పనితీరు, పవర్ ఎఫిషియన్సీ, జిపియు సామర్థ్యం, ఏఐ ఫ్యూచర్లలో చాలా తేడా చూపించవచ్చు.
డిస్ ప్లే లో రీ ఫ్రెష్ రేట్
120 హెచ్ జెడ్, 144 హెచ్ జెడ్ అంటూ ఫోన్ డిస్ప్లే లను ఇటీవల కాలంలో మార్కెటింగ్ చేస్తున్నారు. ఎక్కువ రీ ఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, యానిమేషన్స్ స్మూత్ గా అనిపించవచ్చు. కానీ ఇది ఒకటే డిస్ప్లే నాణ్యతను నిర్ణయించదు. AMOLED/ LTPO technology, brightness, HDR support, colour accuracy, resolution, protection వంటి వాటిని కూడా చూడాలి.
బ్యాటరీ ఎం ఏ హెచ్
6000ఎమ్ఏహెచ్, 7000 ఎమ్ఏహెచ్ అంతకంటే ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. కానీ ఎంహెచ్ బ్యాటరీ పై ప్రభావం చూపిస్తాయి. అలాగే చార్జింగ్ స్పీడ్, చార్జర్ బాక్స్ లో ఉందా లేదా, చార్జింగ్ స్టాండర్డ్స్ వంటి విషయాలను కూడా పరిశీలించాలి .
సాఫ్ట్వేర్ అప్డేట్స్
ఫోన్ కొనుగోలు చేస్తున్నప్పుడు చాలామంది కెమెరా, రామ్, బ్యాటరీ గురించి మాత్రమే అడుగుతారు. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ గురించి ఏ మాత్రం పట్టించుకోరు. ఎన్ని ఆండ్రాయిడ్ ఓ ఎస్ అప్డేట్స్ వస్తాయి.. ఎన్ని సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు.. కంపెనీ అప్డేట్స్ ఎంత వేగంగా విడుదల చేస్తుంది.. వంటి విషయాలను ముందుగా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఫోన్ ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలి అనుకుంటే లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అవసరం.
సామర్థ్యం తక్కువగా ఉన్న మోడల్ ఎంచుకోవడం
ఈరోజుల్లో 128 జీబీ స్టోరేజ్ చాలామందికి త్వరగా నిండిపోవచ్చు. 4k వీడియోలు.. ఫోటోలు.. ఇంస్టాగ్రామ్, వాట్సప్, వీడియో గేమ్స్, ఓటిటి డౌన్లోడ్స్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తే స్టోరేజ్ చాలా వేగంగా ఖాళీ అయిపోతుంది. అందువల్ల ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు స్టోరేజ్ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
వెంటనే కొనుగోలు చేయొద్దు
భారీగా డిస్కౌంట్ లేదా బ్యాంకు ఆఫర్.. ఎక్స్చేంజ్ బోనస్.. అన్లిమిటెడ్ టైం డీల్ అంటూ కనిపిస్తే వెంటనే కొనుగోలు చేయాలి అనిపిస్తుంది. కానీ వాస్తవంగా తెలుసుకోవాల్సిన ప్రశ్న ఆ ఫోన్ ధర నిజంగా తగ్గిందా.. కొత్త మోడల్ వచ్చిందా.. పాత మోడల్ ధర ఇప్పటికే తగ్గిందా.. ఇతర స్టోర్లలో ధర ఎంత ఉంది.. ఎక్స్చేంజ్ వ్యాల్యూ నిజంగా ఎంత.. బ్యాంకు ఆఫర్ కు ఏమైనా షరతులు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించాలి
అవసరాలకు తగ్గట్టుగా
మీరు కేవలం కాల్స్, యూట్యూబ్, వాట్సప్, సోషల్ మీడియా కోసం మాత్రమే ఫోన్ ఉపయోగిస్తుంటే అత్యంత ఖరీదైన ఫోన్ అవసరం ఉండకపోవచ్చు. మీరు రోజు గేమింగ్.. ఫోటోగ్రఫీ.. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మాత్రం తక్కువ ధరను చూసి బడ్జెట్ ఫోన్ కొనడం కూడా సరైన విధానం కాకపోవచ్చు.
రివ్యూస్ చూడకుండా ఇతరుల మాటలు విని
నా ఫ్రెండ్ ఈ ఫోన్ కొన్నాడు బాగుంది. యూట్యూబ్లో ఈ ఫోన్ బెస్ట్ అన్నారు.. ఈ కారణాలతో ఫోన్ కొనడం ప్రమాదకరం. ఒక ఫోన్ ఒక వ్యక్తికి. కానీ అది మీ అవసరాలకు సరిపోకపోవచ్చు. కొనేముందు కెమెరా.. బ్యాటరీ.. పెర్ఫార్మెన్స్.. డిస్ప్లే.. సాఫ్ట్వేర్.. హీటింగ్ నెట్వర్క్.. బులిడ్ క్వాలిటీ అనే అంశాలను కచ్చితంగా పరిశీలించాలి.
చివరగా మీ బడ్జెట్ నిర్ణయించుకోండి. ఈ ప్రధాన అవసరం ఏంటో గుర్తించండి. ప్రాసెసర్.. డిస్ప్లే.. కెమెరా.. బ్యాటరీ పరిశీలించండి.. సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ తెలుసుకోండి. కనీసం ఇతర ఫోన్లతో పోల్చి చూసుకోండి. ప్రస్తుత పేరులతో పాటు గత ధరణి కూడా పరిశీలించండి. మీకు అవసరం లేని ఫీచర్ల కోసం అదనంగా డబ్బు అసలు ఖర్చు చేయకండి..
ఇక ఈ సంవత్సరం స్మార్ట్ఫోన్ మార్కెట్ చాలా పోటీగా ఉంది. ప్రతి నెలలో కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఒక ఫోన్ లో 200 మెగాపిక్సల్ కెమెరా ఉంటే.. మరో ఫోన్లో ఏకంగా 7000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఇంకో ఫోన్లో అత్యంత వేగవంతమైన ప్రాససర్ ఉంది. కానీ ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ మీకు తప్పనిసరిగా సరైన ఫోన్ అవుతుందని కాదు.. మీ అవసరాలు.. బడ్జెట్.. ఫోన్ ను ఎన్ని సంవత్సరాలు ఉపయోగించాలి అనుకుంటున్నారు అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీ డబ్బుకు తగిన విలువ పొందే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ కొనేముందు ఒక విషయం. స్పెసిఫికేషన్స్ కంటే ముందు మీ అవసరాలు చాలా ముఖ్యం.