Homeఎంటర్టైన్మెంట్Madhuri Rathod: మాధురి రాథోడ్ తో రిలేషన్ పై నోరు విప్పిన ఈశ్వర్ సాయి.. నా...

Madhuri Rathod: మాధురి రాథోడ్ తో రిలేషన్ పై నోరు విప్పిన ఈశ్వర్ సాయి.. నా భార్యదే తప్పంటూ కామెంట్స్..

Madhuri Rathod: సోషల్ మీడియా లో గత నాలుగైదు రోజుల నుండి ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ పేర్లు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసిన వీళ్ళ గురించే చర్చ. ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ట్రేడింగ్ టాపిక్ ఉంటే దానిపై నెటిజెన్స్ ఏ రేంజ్ లో రీల్స్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. ఈ అంశంపైనా కూడా నెటిజెన్స్ లక్షల సంఖ్యలో రీల్స్ చేశారు. ఇదంతా […]

Madhuri Rathod: సోషల్ మీడియా లో గత నాలుగైదు రోజుల నుండి ఈశ్వర్ సాయి , మాధురి రాథోడ్ పేర్లు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసిన వీళ్ళ గురించే చర్చ. ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ట్రేడింగ్ టాపిక్ ఉంటే దానిపై నెటిజెన్స్ ఏ రేంజ్ లో రీల్స్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. ఈ అంశంపైనా కూడా నెటిజెన్స్ లక్షల సంఖ్యలో రీల్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాధురి రాథోడ్ తో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు. అదే విధంగా తన భార్య వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం పైన కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

ఈశ్వర్ సాయి మాట్లాడూతూ ‘ఆంధ్ర ప్రదేశ్ నుండి జూనియర్ ఆర్టిస్టు గా వచ్చిన నాకు ఫోక్ ఇండస్ట్రీ ఒక సరికొత్త జీవితాన్ని ఇచ్చింది . మాధురి రాథోడ్ తో నాకు జరిగిన సంఘటనకు , ఫోక్ ఇండస్ట్రీ కి ఎలాంటి సంబంధం లేదు , దయచేసి జాన పద కళాకారుల్ని అవమానించొద్దు’ అంటూ చెప్పొచ్చాడు. ఇక మాధురి రాథోడ్ తో తన బంధం గురించి మాట్లాడుతూ ‘మా ఇద్దరి మధ్య ఆరేళ్ళ పరిచయం ఉంది. అప్పట్లో మేము ఒకరిని ఒకరం గారు అనే పిలిచుకునేవాళ్ళం. ఆరోజుల్లో మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండేది. కానీ గత రెండు నెలలుగా నేను మానసికంగా చాలా కృంగిపోయాను. ఇంటా , బయట, బిజినెస్, ఇలా అన్నిట్లోనూ తీవమైన మెంటల్ ప్రజర్ కి లోనయ్యాను. ఆ సమయం లో నాకు మాధురి తోడుగా నిల్చింది. అలా గత రెండు నెలల నుండి మా మధ్య బంధం బలపడి ఈ రిలేషన్ లోకి అడుగుపెట్టాము’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తన భార్య శరణ్య వీడియో రికార్డు చేసి , సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన విషయం గురించి మాట్లాడుతూ ‘ శరణ్య ఆరోజు అలాంటి పని చేసి ఉండాల్సింది కాదు, ఆమె అలా చేయడం వల్ల , ఇటు నేను , అటు మాధురి రాథోడ్ , చివరికి శరణ్య కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నేను చేసింది తప్పే , కానీ ఒక బుక్ లో కేవలం ఒక్క పేజీ బాగాలేనంత మాత్రానా బుక్ మొత్తం బాగాలేదని అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే నేను చేసిన ఒక్క తప్పు ని పట్టుకొని నా క్యారెక్టర్ ని దూషించడం కరెక్ట్ కాదు’ అంటూ ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper