Homeఆంధ్రప్రదేశ్‌YS Vivekananda Reddy Case: వైయస్ వివేకా మరణం వెనక పెద్ద స్కెచ్.. అవినాష్ రెడ్డి...

YS Vivekananda Reddy Case: వైయస్ వివేకా మరణం వెనక పెద్ద స్కెచ్.. అవినాష్ రెడ్డి అసలు బాగోతం బట్టబయలు.. ఈడి తర్వాత చేసేది అదే

YS Vivekananda Reddy Case: ఇన్నాళ్ళ వరకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేవలం రాజకీయపరమైన కారణాలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. అయితే ఇప్పుడు ఈడి దాఖలు చేసిన నోటీసులలో సరికొత్త విషయాలు వెలుగు చూశాయి. ఫలితంగా ఈ హత్య కేసు వ్యవహారంలో సంచలన పరిణామాలు ఉన్నాయని తెలియ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈడి తదుపరి అడుగులు ఏం వేస్తుంది.. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. అనేది చూడాల్సి ఉంది.. వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం […]

YS Vivekananda Reddy Case: ఇన్నాళ్ళ వరకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేవలం రాజకీయపరమైన కారణాలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. అయితే ఇప్పుడు ఈడి దాఖలు చేసిన నోటీసులలో సరికొత్త విషయాలు వెలుగు చూశాయి. ఫలితంగా ఈ హత్య కేసు వ్యవహారంలో సంచలన పరిణామాలు ఉన్నాయని తెలియ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈడి తదుపరి అడుగులు ఏం వేస్తుంది.. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. అనేది చూడాల్సి ఉంది..

వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఈడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ దారుణ వెనుక భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు.. మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడి భావిస్తోంది. విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి తాజాగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేసింది. వివేకాను చంపడానికి ఏకంగా 40 కోట్ల వరకు డీల్ కుదిరిందని.. ఇందులో ఉన్న సంచలన కోణాన్ని దర్యాప్తు సంస్థలు బయటపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు.. ఇతర కోణాలు ఇప్పుడు అత్యంత సంచలనంగా మారాయి.

వివేకానంద రెడ్డి ని చంపిన కేసులో భారీగా నగదు చేతులు మారినట్టు తెలుస్తోంది. అంతేకాదు నగదు ప్రవహించిన తీరు అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్నాయని దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం.. సునీల్ యాదవ్.. ఎర్ర గంగిరెడ్డి బ్యాంక్ ఖాతాలను దర్యాప్తు సంస్థల అధికారులు పరిశీలించారు. వివేకానంద రెడ్డి హత్య.. ఆ తర్వాత జరిగిన నగదు బదిలీ.. ఇతర వ్యవహారాలు అన్నీ కూడా అవినాష్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి దర్శకత్వంలోనే జరిగాయని ఈడి చెబుతోంది. ఈ హత్యలో పాలుపంచుకున్న వ్యక్తులకు ముందస్తుగా ఇచ్చిన సొమ్ము నుంచి మిగిలిన నిధుల వరకు జరిగిన వ్యవహారం ఈడి దర్యాప్తులో ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

ఈ దారుణమైన కుట్ర అమలు చేయడంలో భాస్కర్ రెడ్డి.. అవినాష్ రెడ్డి కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ చెబుతున్నది. చార్జ్ షీట్ లలో దర్యాప్తు సంస్థ అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు సాక్షాలను విధ్వంసం చేశారని.. ఘటనా స్థలంలో గుండెపోటు డ్రామా.. ఈ కేసులో నిందితులను రక్షించడం.. ఇలా అనేక వ్యవహారాలలో వీరి ప్రమేయం ఉందని టిడిపి నేతలు ఆరాపిస్తున్నారు. సిబిఐ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. అందువల్ల గుర్తించిందని.. ఈ నేరానికి సంబంధించిన నెట్వర్క్.. ఈడి సేకరించిన బ్లాక్ మనీ, మనీలాండరింగ్ వ్యవహారాలు తోడు కావడంతో ఈ కేసు లో సంచలన పరిణామాలు ఉన్నాయని తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయితే తదుపరి అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా అనే చర్చ కూడా నడుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper