Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu:90ml డైలాగులు చెప్పిన.. అంబటిని ఈడీ అధికారులకు పట్టించింది ఎవరు..

Ambati Rambabu:90ml డైలాగులు చెప్పిన.. అంబటిని ఈడీ అధికారులకు పట్టించింది ఎవరు..

Ambati Rambabu:ఏపీలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ లో ఈడి అధికారులు వైసిపి కీలక నాయకుడు అంబటి రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ముందుగా తనకు రాలేదని.. ఆలస్యంగా వచ్చాయని.. వంటి 90 ఎం.ఎల్ డైలాగులను అంబటి రాంబాబు చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఈడి అధికారులకు అసలు వాస్తవాలు తెలుసని.. అందువల్లే రాంబాబుకు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. ఈడి నోటీసులు ఇచ్చిన తర్వాత రాంబాబు అనేక రకాలుగా నాలుక మడత పెట్టారు. ఇప్పుడు తాజాగా కొత్త […]

Ambati Rambabu:ఏపీలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ లో ఈడి అధికారులు వైసిపి కీలక నాయకుడు అంబటి రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ముందుగా తనకు రాలేదని.. ఆలస్యంగా వచ్చాయని.. వంటి 90 ఎం.ఎల్ డైలాగులను అంబటి రాంబాబు చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఈడి అధికారులకు అసలు వాస్తవాలు తెలుసని.. అందువల్లే రాంబాబుకు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

ఈడి నోటీసులు ఇచ్చిన తర్వాత రాంబాబు అనేక రకాలుగా నాలుక మడత పెట్టారు. ఇప్పుడు తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు హాజరవుతారని కొత్తగా చెబుతున్నారు. వాస్తవానికి లిక్కర్ స్కామ్ లో రాంబాబు పాత్ర గురించి ఈ డి అధికారులకు మొత్తం తెలుసు. సాక్షాలు కూడా వారి వద్ద ఉన్నాయి. అందువల్లే ఆయనకు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. రాంబాబు ఏ స్థాయిలో పెర్ఫార్మన్స్ చేసినప్పటికీ.. మద్యం కుంభకోణం లో ఆయన రోల్ ను దర్యాప్తు సంస్థలు పకడ్బందీ ఆధారాలతో పట్టుకున్నాయని తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి.. పురుషోత్తం అనే వ్యక్తులను రంగంలోకి దించి.. వారికి లిక్కర్ సరఫరా.. డిస్ట్రిబ్యూషన్ వంటి కాంట్రాక్టర్లను అప్పగించారని తెలుస్తోంది. దీనికిగాను భారీగానే స్వీకరించినట్టు సిట్, ఈడి అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే అంబటి రాంబాబుకు బినామీలుగా ఉన్న వ్యక్తులే ఈ విషయాలను దర్యాప్తు అధికారులకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడంతో అంబటి తెర మందికి వచ్చారు. తనకు ఏమీ తెలియదని 90 ఎం.ఎల్ కబుర్లు చెప్పారు. ఇప్పటికే మద్యం కుంభకోణం లో కారుమూరి నాగేశ్వరరావు.. ఇంకా కొంతమంది నాయకులు జైలు బాట పట్టారు. ఆదర్శాలు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో.. అంబటి రాంబాబు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఈడి అధికారులు తనను అదుపులోకి తీసుకొని.. రిమాండ్ కార్డు ఇస్తారేమోనని ఆందోళన అంబటి రాంబాబులో కనిపిస్తోందని టిడిపి నేతలు అంటున్నారు. ఈడి చట్టం కింద అరెస్టు కనుక చేస్తే సాధారణ పోలీస్ కేసుల మాదిరిగా బెయిల్ అంత ఈజీగా రాదని.. ఎంతటి వారైనా సరే జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

ఇన్ని రోజులపాటు ధీమా వ్యక్తం చేసిన అంబటి రాంబాబు.. తన అనుచరులే అధికారులకు సమాచారం అందించడంతో ఆందోళన చెందుతున్నారు.. పైగా ఈడి అధికారులు త్వరలోనే ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎదుటి వారి మీద విమర్శలు.. రకరకాల వ్యాఖ్యానాలు చేసే అంబటి రాంబాబు.. ఈడి గురించి తలుచుకోగానే భయపడుతున్నారని.. ఎప్పుడు అరెస్టు వారెంట్ గుమ్మం తలుపు తడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈడి అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడానికి అనారోగ్యం వంటి సాకులను రాంబాబు చెబితే.. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఊరుకోరని.. అటువంటి సాకులు చెల్లక పోవచ్చని టిడిపి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper