YS Jagan Mohan Reddy: జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ముఖేష్ ఋషిని ఉద్దేశించి ఓ డైలాగ్ అంటారు గుర్తుందా.. మీకు భయం గ్రాములు.. కిలోలలో కాదు అంకుల్.. టన్నుల్లో ఇస్తాను అంటాడు. సేమ్ ఇప్పుడు అదే డైలాగ్ మాదిరిగా ఈడి దూసుకు వస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు భయాన్ని టన్నుల్లో ఇస్తోంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది. ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారిపోయాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థల అధికారులు దూకుడుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులను అరెస్ట్ చేశారు. కొంతమేర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈడి అధికారులు తాజాగా కీలక అడుగులు వేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది.
అందువల్లే ఇటీవల కాలంలో జగన్ చేస్తున్న ప్రసంగాలు.. వేస్తున్న అడుగులు.. ఆకస్మిక కార్యాచరణ చిత్రంగా ఉంది. ఆయనలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగులను రెచ్చగొట్టి డీఎస్సీ క్రీడాకోటపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా గవర్నర్ కొలువు ఉండే రాజ్ భవన్ వైపు వెళ్లి.. తన పార్టీ నాయకులతో వినతిపత్రాలు సమర్పింప చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రంలో ఢిల్లీని మించి మద్యం కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. లావాదేవీలు.. డిస్టలరీల బెదిరింపులు.. ప్రత్యేక బ్రాండ్ల ముసుగులో భారీగా దూకుడు జరిగింది. దీనికి సంబంధించిన ట్రయల్స్ మొత్తాన్ని దర్యాప్తు సంస్థలు విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు పరిధి విస్తరిస్తున్న క్రమంలో జగన్ అండ్ కోలో ఆందోళన మొదలైందని టిడిపి నేతలు చెబుతున్నారు.
మద్యం కుంపకంలో జగన్ కు అత్యంత దగ్గర వ్యక్తిగా.. తెర వెనుక ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించాడని అనిల్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన పాత్ర మీద దర్యాప్తు సంస్థల అధికారులు మరింత లోతుగా దృష్టిపెట్టారు. డబ్బులు సేకరించడం.. వాటిని వివిధ మార్గాలలో బయటికి పంపించడం వంటి విషయాల వెనుక సూత్రధారిగా అనిల్ రెడ్డి ఉన్నాడని తెలుస్తోంది. ఏ క్షణమైనా సరే ఆయనను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.. ఇప్పటికే అనేకమంది సూత్రధారులు పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే ఆ తర్వాత నేరుగా జగన్ నే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తాయని తెలుస్తోంది. అందువల్లే గతానికి భిన్నంగా జగన్ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఇదే క్రమంలో బెంగళూరులోని తన ప్యాలస్ లో రహస్య మంతనాలు కూడా చేస్తున్నారని సమాచారం. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు రిలయన్స్ గ్రూప్ ప్రతిపాదించిన వ్యక్తిని జగన్ రాజ్యసభకు పంపించారు. ఆ వ్యక్తి మరెవరో కాదు పరిమల్ నత్వాని. ఇటీవల బెంగళూరులో ఒక వివాహ వేడుకకు పరిమల్ హాజరయ్యారు. ఆ సమయంలో జగన్ ఆయనను తన నివాసానికి తీసుకొనివెళ్ళారు. ఏకాదంగా చర్చలు జరిపారు. అయితే ఆ చర్చల్లో ఏం జరిగింది.. ఢిల్లీలో విస్తృత స్థాయిలో పలుకుబడి ఉన్న పరిమల్ జగన్ కు ఎటువంటి హామీ ఇచ్చారు అనేది బయటకు తెలియపైనప్పటికీ.. జగన్ ఆకస్మికంగా ఈ స్థాయిలో లంచ్ డిప్లమసీ ని ఉపయోగించుకోవడం వెనుక జరుగుతున్నది ఏంటో అందరికీ తెలుసు.