Budget Cars India 2026: ధరలు పెరిగిపోతున్నాయి. జీతం ఎంత వచ్చినా సరిపోడం లేదు. ఇలాంటి సమయంలో నెలకు 25వేల జీతం వచ్చేవారు సొంతంగా కారు కొనుగోలు చేయడం సాధ్యమేనా.. పైగా నేటి కాలంలో చాలామందికి కారు అనేది ఒక అవసరంగా మారిపోయింది. కుటుంబంతో కలిసి ప్రయాణించడం.. పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లడం.. అత్యవసరమైన సమయంలో ఉపయోగించుకోవడానికి కారు అనేది అవసరంగా మారిపోయింది. అయితే నెలవారి జీతం 25000 మాత్రమే ఉంటే కారు కొనడం సాధ్యమేనా.. భారీగా ఈఎంఐ భారం లేకుండా చిన్న బడ్జెట్లో కారును సొంతం చేసుకోవచ్చా..
నిజానికి సరైన ప్లానింగ్ ఉంటే నెలకు 25 ఆదాయం ఉన్నవారు కూడా ఎంట్రీ లెవెల్ కారును కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ముఖ్యంగా 2020లో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని చిన్న కార్లు తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులకు ఉపయుక్తంగా ఉంటున్నాయి. నెలకు 25వేల జీతం వస్తున్న వ్యక్తి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కారు emi కోసం కేటాయించడం సరైన విధానం కాదు. సాధారణంగా నెలకు 3000 నుంచి 5000 మధ్య ఈఎంఐ ఉండేలా ప్లాన్ చేసుకోవడం కొంతవరకు బాగానే ఉంటుంది. అయితే ఇప్పటికే ఇతర రుణాలు.. కుటుంబ ఖర్చులు గనుక ఉంటే ఈఎంఐ ని ఇంకా తగ్గించుకోవాలి. ఉదాహరణకు నాలుగు లక్షల కారులోను ఐదు సంవత్సరాలకు 9.5% వార్షిక వడ్డీతో తీసుకుంటే నెలకు సుమారు 8400 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇది 25వేల వేతనంలో ఎక్కువ మొత్తం. అందువల్ల ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించడం లేదా తక్కువ ధరలో కారు కొనుగోలు చేయడం చాలా మంచిది.
తక్కువ ధరలో లభించే టాప్ 10 కార్లు ఇవే
మారుతి సుజుకి s presso
దీని ధర 3.50 లక్షలు. చిన్న కుటుంబాలకు.. నగర ప్రయాణాలకు అనువైన కారు. వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్.. మాన్యువల్.. ఆటోమెటిక్ ఆప్షన్లు ఉన్నాయి.
మారుతి ఆల్టో k10
ధర 3.70 లక్షలు. మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి ఇది మంచి ఆప్షన్. తక్కువ ధర.. కాంపాక్ట్ సైజు.. సిటీ డ్రైవింగ్ కు అనుకూలంగా ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్
దీని ధర 4.53 లక్షలు. ఎస్ యు వి తరహా రూపం.. ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్.. అట్రాక్టివ్ డిజైన్ కోరుకునే వారికి అత్యుత్తమమైన కారు ఇది.
మారుతి సెలెరియో
దీని ధర 4.70 లక్షలు. మంచి మైలేజ్ ఇచ్చే వారికి ఇది అత్యుత్తమమైనది. పెట్రోల్.. సిఎన్జి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
మారుతి వ్యాగన్ఆర్
దీని ధర 4.99 లక్షలు. ఎత్తయిన క్యాబిన్ . మంచి హెడ్ రూమ్.. కుటుంబ ప్రాణాలకు అనువైన స్థలం ఇందులో ఉంటుంది
టాటా టియాగో
దీని ధర 4.277 లక్షలు.. పటిష్టమైన బాడీ నిర్మాణం.. మంచి ఫీచర్లు కోరుకునే వారికి పరిశీలించగలిగే హ్యాచ్ బ్యాక్ ఇందులో ఉంది. పెట్రోల్.. సిఎన్జి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
మారుతి ఈకో
దీని ధర 5.28 లక్షలు. ఎక్కువమంది ప్రయాణించే కుటుంబాలకు.. చిన్న చిన్న వ్యాపార అవసరాలకు ఉపయోగపడే మల్టీపర్పస్ వాహనం ఇది.
మారుతి స్విఫ్ట్
దీని ధర 5.84 లక్షలు. స్టైలిష్ లుక్కింగ్.. డ్రైవింగ్ అనుభూతి.. మైలేజ్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
మారుతి బాలెనో
దీని ధర 6.10 లక్షలు. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అనుభూతి. విశాలమైన క్యాబిన్.. కుటుంబ ప్రయాణాలకు అణువైన కారు ఇది.
మారుతి డిజైర్
దీని ధర 6.31 లక్షలు. సెడాన్ కారు కొనుగోలు చేయాలనుకునే మిడిల్ క్లాస్ వాళ్లకు ఇది మంచి ఎంపిక. బూట్ స్పేస్.. సౌకరివంతమైన ప్రయాణం ఇందులో ఉంటుంది.
నెలకు 25 వేల జీతం వస్తున్న వారు కారు కొనడానికి ముందుగా డౌన్ పేమెంట్ మీద ఫోకస్ చేయాలి. ఉదాహరణకు 5 లక్షల ఆన్ రోడ్డు ధర ఉన్న కారుకు రెండు లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. మిగతా మూడు లక్షలు లోన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ 9.5% వార్షిక వడ్డీ.. ఐదు సంవత్సరాల కాలపర్మతి అనుకుంటే.. లోన్ మొత్తం రెండు లక్షలు ఉంటే నెలవారి ఈఎంఐ 4200 చెల్లించాలి. ఒకవేళ 2.5 లక్షలు అయితే నెలకు 5,250 చెల్లించాలి. ఒకవేళ మూడు లక్షలు గనక అయితే నెలకు 6,300 చెల్లించాలి. ఒకవేళ నాలుగు లక్షలు గనక అయితే 8,400 చెల్లించాలి. ఈఎంఐ ఖర్చు మాత్రమే కాకుండా.. ఇన్సూరెన్స్ .. సర్వీసింగ్ కోసం కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
నెలకు 25వేల జీతం ఉన్నవారు మరీ ఖరీదైన కార్ల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. సొంతంగా డౌన్ పేమెంట్ చెల్లించగలిగితేనే ఆల్టో కే టెన్.. ఎస్ ప్రెసో .. క్విడ్ వంటి కార్లను పరిశీలించవచ్చు. కొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉంటే సెలెరియో.. వ్యాగన్ఆర్ వంటి కార్లను పరిశీలించవచ్చు. కుటుంబ ఖర్చులు.. ఇంటి రెంట్.. ఇతర అరుణాలు ఉన్నవారు కారు కొనుగోలు చేసేందుకు తొందరపడకూడదు. కనీసం కొన్ని నెలల ఖర్చుల వరకు డబ్బులను నిలువ చేసుకొని ఉంచుకోవడం మంచిది. అవసరమైతే తక్కువ ధరలో.. మంచి కండిషన్ ఉన్న సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ఉత్తమం.
ఈ కథనం నవంబర్ 21 నాటి ధరల ఆధారంగా ప్రారంభ ధరలను మాత్రమే పొందుపరచడం. ఇది ఎక్స్ షోరూం ధరలు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ రోడ్ ధరలు వేరే విధంగా ఉంటాయి. మరోవైపు 25 వేల జీతానికి పైన పేర్కొన్న అన్ని కార్లు సరిపోతాయని కాదు. దీనిని పాఠకులు పరిశీలించాలి. చివరగా కారు కొనుగోలు చేయడం అనేది హోదాకు సంబంధించిన విషయం కాదు. అది చాలామందికి సౌకర్యాన్ని అందించే సాధనం మాత్రమే.