YS Sharmila: ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం ఈనెల 25న జరగబోతోంది. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో ఆమె వివాహాన్ని గతంలోనే నిర్ణయించారు. ఈనెల 25న బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో వివాహం జరపాలని అనుకున్నారు. జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ వివాహాన్ని అక్కడ కాకుండా.. మరోచోట నిర్వహిస్తామని ఇప్పటికే షర్మిల ప్రకటించారు. అయితే వివాహ వేదికను ఇప్పటివరకు బయటికి ప్రకటించలేదు.
వివాహ వేదిక ఖరారు కాకపోయినప్పటికీ అంజలి రెడ్డి హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. హల్ది వేడుకలు వేగంగా అంజలి రెడ్డికి పసుపు పూసి.. మంగళ స్నానాలు చేయించారు. ఈ క్రతువులో అంజలి రెడ్డి వెంట షర్మిల.. ఆమె భర్త అనిల్ ఉన్నారు. ఈ ఫోటోలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. కొంతమంది టిడిపి నాయకులు కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. జగన్ బెంగళూరులో పెళ్లి జరపడానికి ఆసక్తిని చూపించకపోవడంతో.. టిడిపి నాయకులు కసిగా సోషల్ మీడియాలో అంజలి రెడ్డి ఫోటోలను సర్కులేట్ చేస్తున్నారు. వైసిపి నాయకులను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.
అంజలి రెడ్డి.. రఘురాం రెడ్డిది పెద్దలు కుదిరించిన వివాహం. రఘురాం రెడ్డి కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్ళింది. అక్కడ స్థిరపడింది. రఘురాం రెడ్డి తల్లిదండ్రులు వ్యాపారం చేస్తారు. రఘురాం రెడ్డి వైద్యుడిగా స్థిరపడ్డారు. అంజలి రెడ్డి వివాహాన్ని బెంగళూరులోనే నిర్వహించేందుకు షర్మిల అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి అన్న పంతం నెగ్గడంతో షర్మిల తట్టుకోలేక వేరే ప్రాంతంలో తన కూతురి వివాహాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్ నగరంలో నూతన దంపతులకు రిసెప్షన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు.. రాజశేఖర్ రెడ్డి అభిమానులు హాజరవుతారని సమాచారం.