KL Rahul: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ మరోసారి తన స్టామినా చూపించాడు. కివీస్ గడ్డమీద జరుగుతున్న తొలి టెస్ట్ లో సూపర్ సెంచరీ సాధించాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇతని చరిత్ర ద్వారా టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ (సేనా దేశాలు) ఈ నాలుగు దేశాల్లో టెస్టు సెంచరీలు సాధించిన తొలి భారతీయ ఓపెనర్ గా రికార్డు నెలకొల్పాడు.
న్యూజిలాండ్ జట్టుతో వెల్డింగ్టన్ బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ లో రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. క్రితం రోజు అతడు హాఫ్ సెంచరీ తో నాట్ అవుట్ గా నిలిచాడు మూడో రోజు కూడా అదే స్థాయిలో పట్టుదల చూపించాడు. జాగ్రత్తగా ఆడాడు. పూర్తిగా నిలదొక్కుకున్నాడు. చివరికి 27 బంతులలో సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ గడ్డమీద అతడికి ఇది తొలి టెస్ట్ సెంచరీ.
టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్.. న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా దేశాలను సేనా దేశాలు అని చెబుతుంటారు. ఈ దేశాలలో పర్యటించి సెంచరీ చేయడం బాటర్లకు పెద్ద సవాల్ తో కూడుకున్న విషయం. అక్కడి మైదానాలు.. వాతావరణ పరిస్థితులు.. బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 2014లో 110 పరుగులు చేసిన రాహుల్.. ఇంగ్లాండ్ దేశంలో 2018.. 2021.. 2025 సంవత్సరాలలో సెంచరీల మోత మోగించాడు. దక్షిణాఫ్రికాలో 2023లో 123 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్ లో కూడా శతకం చేసి.. నాలుగు సేనా దేశాలలో సెంచరీలు పూర్తిచేసుకున్నాడు.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ టెస్ట్ ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఆసియా ఒపెనర్లో మాత్రం పాకిస్తాన్ ఆటగాడు సయ్యద్ అన్వర్ గతంలోనే నాలుగు సేనా దేశాలలో సెంచరీలు చేశాడు. ఇప్పుడు మన రాహుల్ కూడా అదే అరుదైన జాబితాలో చేరిపోయాడు. న్యూజిలాండ్ దేశంలో సెంచరీ చేయడం ద్వారా నాలుగు సేనా దేశాలలో టెస్టు శతకాలు సాధించిన భారతీయ ప్లేయర్ల ప్రత్యేక జాబితాలో రాహుల్ ఐదవ ఆటగాడిగా ఆవిర్భవించాడు. ఇతడి కంటే ముందు సచిన్.. ద్రావిడ్.. విరాట్.. అజహరుద్దీన్ రికార్డు సృష్టించారు.
కేఎల్ రాహుల్ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఫామ్ కోల్పోయి.. జట్టులో స్థానం లేకపోవడంతో ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. అయితే ప్రతిసారి తన బ్యాటింగ్ ద్వారా విమర్శకుల నోళ్లకు తాళాలు వేయించాడు ముఖ్యంగా విదేశీ గడ్డమీద అతని ప్రదర్శన భారత జట్టుకు ఎంతో బలం. తాజాగా న్యూజిలాండ్ పై చేసిన సెంచరీ తో తన సత్తా మరోసారి చాటాడు. సేనా దేశాలలో 4 చోట్ల టెస్ట్ సెంచరీలు చేసిన తొలి భారతీయ ఓపెనర్ గా రికార్డ్ సృష్టించి.. అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు.
Middle-order batter in ODIs, opener in Tests,KL Rahul excelling in two of the toughest roles in New Zealand. He truly is one of a kind.
#NZvIND #KLRahul #klrahul #INDvsNZ #INDvNZ #nzvsind
#TestCricket #StarAcademyLeLive #2026MAMAAWARDS #TREASURE #MAMAAWARDS #CricketTwitter https://t.co/xYaHGEuySz— SuyogD3479 (@SuyogD77) November 21, 2026