spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan And Ambati Rambabu: కాపు "ఐకానిక్"లు.. ఏంటన్నా ఈ రాజకీయం?!

Jagan And Ambati Rambabu: కాపు “ఐకానిక్”లు.. ఏంటన్నా ఈ రాజకీయం?!

Jagan And Ambati Rambabu: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. పట్టు బిగించాలని కూటమి.. దాని పట్టు సడలించాలని వైయస్సార్ కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పాత్రధారులు, సూత్రధారులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం ద్వారా తమ రాజకీయ పరపతి పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంబటి రాంబాబును కాపు ఐకాన్ గా చూపిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆయన విషయంలో కాపులకు భిన్న వైఖరి ఉంది. అప్పుడెప్పుడో 1989లో ఆయన గెలిచారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ వేవ్ లో నిలబడగలిగారు. అయితే ఆయన విపరీత వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అందుకే ఇప్పుడు ఆయనను రాత్రికి రాత్రే కాపు జాతి నాయకుడిగా మార్చాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

అయితే ఈ ఎపిసోడ్ లో ఒక్క విషయాన్ని గ్రహించాలి. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి ఎంత మైలేజ్ వస్తుందో చెప్పలేం కానీ.. ఇప్పటివరకు సత్తెనపల్లి హీరో గా ఉన్న ఆయన రాత్రికి రాత్రి స్టేట్ నాయకుడిగా మారిపోయారు అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించడం.. అంబటి రాంబాబు టైగర్ అని చెప్పడం.. కాపు ఐకానిక్ అని రాష్ట్రవ్యాప్తంగా చాటింపు వేయడం మాత్రం అంబటి రాంబాబుకు ఊహించని వరాలే. కానీ రాష్ట్రంలో కాపులు మాత్రం అంబటి రాంబాబును కనీసం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. కానీ వైసిపి తమ నెత్తిన పెడుతుండడాన్ని కాపులు సహించుకోలేకపోతున్నారు. మొన్నటివరకు కాపు ఐకానిక్ అంటే ముద్రగడ పద్మనాభం ఇలానే చూపించారు. చివరకు ఆయన నాయుడు కాదు రెడ్డి అంటూ తనకు తానుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునేలా చేశారు. అయితే ఒక్కటి మాత్రం నిజం పౌరుషం కాపు నేతలది. రాజకీయ లబ్ది ఇంకొకరిది.

కాపులు( Kapu caste ) రాజ్యాధికారం కావాలని కోరుకున్నారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు కూడా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ అనేసరికి అదేదో హోదా కాదు. చంద్రబాబుతో సమానంగా ఆయనకు మంచి గౌరవం దక్కుతోంది. ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తున్నారు. అయితే ఎక్కడా కాపు లో ప్రయోజనాలకి అన్నట్టు కాదు. అందరి సంక్షేమం దృష్ట్యా ఆలోచన చేసేవారు పవన్. ఇప్పుడు ఆయనను తగ్గించేందుకు అంబటి రాంబాబు లాంటి నేతను కాపుల ఐకానిక్ గా జగన్మోహన్ రెడ్డి పోల్చడం ఎంత మాత్రం రుచించడం లేదు కాపులకు. అయితే అంబటి రాంబాబు తో పాటు పేర్ని నాని లాంటి వారితో కాపు రాజకీయం చేయడం ఏమిటనేది వైసీపీ శ్రేణుల్లోనే ఒక రకమైన చర్చ ఉంది. ఇది మరోసారి గాడిన తప్పే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Oktelugu Epaper