Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: పులివెందులలో జగన్ ఆశలు అడియాసలు

YS Jagan Mohan Reddy: పులివెందులలో జగన్ ఆశలు అడియాసలు

YS Jagan Mohan Reddy: ఏపీలో స్థానిక ఎన్నికలు వైసిపి ఊహించినట్టు కాకుండా.. పకడ్బందీగా జరిగాయి. పోలీసులు మందస్తుగానే పరిస్థితులను అంచనా వేశారు. ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చూశారు. అందువల్లే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించారు. దీంతో వైసిపి అంచనా వేసినట్టుగా ఎన్నికలు జరగకపోవడంతో.. ఆ పార్టీ అధినేత ప్రజాస్వామ్యం.. స్వచ్ఛ గురించి మాట్లాడారు. సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ రకరకాలుగా హంగామా చేశారు. చివరికి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయకుండానే […]

YS Jagan Mohan Reddy: ఏపీలో స్థానిక ఎన్నికలు వైసిపి ఊహించినట్టు కాకుండా.. పకడ్బందీగా జరిగాయి. పోలీసులు మందస్తుగానే పరిస్థితులను అంచనా వేశారు. ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చూశారు. అందువల్లే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించారు. దీంతో వైసిపి అంచనా వేసినట్టుగా ఎన్నికలు జరగకపోవడంతో.. ఆ పార్టీ అధినేత ప్రజాస్వామ్యం.. స్వచ్ఛ గురించి మాట్లాడారు.

సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ రకరకాలుగా హంగామా చేశారు. చివరికి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు. రీపోలింగ్ చేపట్టాలంటూ డిమాండ్ కూడా చేశారు. ఈ మాటలు మొత్తం ఆయన కేవలం స్క్రిప్ట్ చూసుకుంటూ మీడియా ముందు చెప్పడం విశేషం. కనీసం సొంత నియోజకవర్గంలో గ్రామాల పేర్లు.. ఇతర వివరాలు ఆయన నేరుగా చెప్పలేకపోయారు. జగన్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అక్కడ రీపోలింగ్ చేపట్టిందుకు అవకాశం లేదని తెలుస్తోంది. చట్టపరంగా రీ పోలింగ్ చేపట్టేందుకు అక్కడ ఏమాత్రం ఆస్కారం లేదు. పులివెందుల ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శాంతి భద్రతలను పది రక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ మొత్తం రికార్డయింది. జగన్ చెప్పినట్టుగా దొంగ ఓట్లు పడ్డాయని.. ఏజెంట్లను మొత్తం అడ్డుకున్నారని జగన్ చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. ఒకవేళ జగన్ చెప్పినట్టుగా జరిగి ఉంటే సిసిటి ఫుటేజీ ఆధారంగా సీన్ బై సీన్ ను అధికారులు విశ్లేషించేందుకు సిద్ధమయ్యారు. అయితే అటువంటి పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో జగన్ వాదనకు విలువ లేకుండా పోయింది.

ఓటమి వల్ల జగన్ రకరకాల ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చారని.. రీ పోలింగ్ చేయాల్సిన అవసరం లేదని.. సీన్ క్రియేట్ చేద్దామని చూస్తే చివరికి ఆయనే బొక్కా బోర్లా పడ్డారని టిడిపి నేతలు అంటున్నారు. పులివెందులలో రీపోలింగ్ కాదు కదా.. జగన్ కోరుకున్నట్టు ఏది జరగదని.. ఎందుకంటే ఇది టిడిపి పరిపాలన కాబట్టి అంతా పారదర్శకంగా ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు. జగన్ చేసిన అహంగామాను వైసిపి.. సాక్షి మీడియా గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

జగన్ చెప్పినట్టుగా పులివెందులలో అలాంటి సంఘటనలు జరగలేదు. పైగా పోలీసులు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి సహకరించారు. ఏదో జన్ క్రియేట్ చేసేందుకు పోలింగ్ ఏజెంట్లుగా మగవాళ్లను కాకుండా ఆడవాళ్లను పంపించారు. ఆడవాళ్లను ముందుపెట్టి హంగామా చేయాలని చూశారు. కానీ , ఆ ఆశ కూడా నెరవేరలేదు. చివరికి జగన్ అంచనా వేసినవి ఏవీ జరగకపోవడంతో ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అయిందని టీడీపీ నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper