Homeఅంతర్జాతీయంBrandon Gill statement: టెక్సాస్‌లో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా.. రిపబ్లికన్‌ నేత ఆందోళన

Brandon Gill statement: టెక్సాస్‌లో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా.. రిపబ్లికన్‌ నేత ఆందోళన

Brandon Gill statement: యూకేలో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. దీంతో స్థానికులమే స్థానికేతరులుగా బతకాల్సి వస్తోందని అక్కడి బిటిషర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింల వలసలకు చెక్‌ పెట్టేందుకు యూకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక తాజాగా అమెరికాలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోందటున్నారు రిపబిక్లన్‌ నేత. టెక్సాస్‌లో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా అని టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు బ్రాండన్‌ గిల్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అమెరికా రాజకీయాల్లో వలసలు, స్థానిక […]

Brandon Gill statement: యూకేలో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. దీంతో స్థానికులమే స్థానికేతరులుగా బతకాల్సి వస్తోందని అక్కడి బిటిషర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింల వలసలకు చెక్‌ పెట్టేందుకు యూకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక తాజాగా అమెరికాలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోందటున్నారు రిపబిక్లన్‌ నేత. టెక్సాస్‌లో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా అని టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు బ్రాండన్‌ గిల్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అమెరికా రాజకీయాల్లో వలసలు, స్థానిక సంస్కృతి గురించి చర్చలు తీవ్రమవుతున్నాయి. షాపింగ్‌ మాల్స్‌లో పాకిస్తాన్‌ వాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు.

స్థానికత్వం కోల్పోతున్నాం..
గిల్‌ వ్యాఖ్యల ప్రకారం.. డల్లాస్‌ ప్రాంతంలో కొన్ని వాణిజ్య కేంద్రాలు స్థానికత్వాన్ని కోల్పోతున్నాయి. ఇస్లామిక్‌ వలసల పెరుగుదలతో సమాజం, సంస్కృతి ప్రదేశాలు మారుతున్నాయని గిల్‌ పేర్కొన్నారు. ‘మనకు ఇష్టమైన అమెరికా మారుతోంది‘ అని ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది స్థానికుల్లో భయాన్ని కలిగిస్తోందని చెప్పారు.

వలసల ప్రభావం..
టెక్సాస్‌లో ఇస్లామిక్‌ జనాభా గణనీయంగా పెరిగింది. యూఎస్‌సీఐ డేటా ప్రకారం, గత దశాబ్దంలో మధ్యప్రాచ్యం నుంచి వలసలు 30% పెరిగాయి. డల్లాస్‌ వంటి నగరాల్లో మసీదులు, హలాల్‌ షాపులు పెరగడం స్థానిక వాతావరణాన్ని మార్చింది. ఇది ఆర్థిక ప్రయోజనాలు తెచ్చినా, సాంస్కృతిక ఘర్షణలకు దారితీస్తోంది. గిల్‌ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అయితే గిల్‌ ఆందోళనను డెమొక్రాట్లు ఖండించారు. రిపబ్లికన్లు ‘ఇస్లామోఫోబియా‘తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక రిపబ్లికన్లు మాత్రం గిల్‌కు మద్దతు తెలిపారు.

ఇలాంటి మార్పులు అమెరికా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకవైపు వైవిధ్యం పెరుగుతుండగా, మరోవైపు సమైక్యతకు సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస నియమాలు కఠినతరం చేయాలా లేక సాంస్కృతిక సమన్వయం పెంచాలా అనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper