Kalvakuntla Kavitha: సొంత పార్టీ పెట్టిన తర్వాత సాక్షి మీడియాలో తన వార్త రావడం లేదని.. తాను ఎటువంటి ప్రకటన చేసిన సరే అందులో వేయరని.. కనీసం తన లైవ్ కూడా అందులో టెలికాస్ట్ కాదని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక విషయాలను బయటపెట్టారు.. తన పార్టీ ఏర్పాటు.. తాను వేస్తున్న రాజకీయ అడుగులు.. ఇలా అనేక విషయాలను కవిత కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీలోకి తాను తిరిగి వెళ్ళేది లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో మాత్రమే గులాబీ పార్టీ బలంగా ఉందని.. అది కూడా పార్టీ భారీగా ఖర్చు పెడితేనే అలా కనిపిస్తోందని కవిత స్పష్టం చేశారు.. గణపతి నిమజ్జనం వేడుకల సమయంలో కేసీఆర్ పాటలు వినిపించడం వెనుక ఉన్నది డబ్బు మాత్రమేనని.. కొంతమందికి డబ్బు ఇచ్చి అలా చేస్తున్నారని పార్టీ నాయకత్వం మీద కవిత ఆరోపణలు చేశారు.
తాను ఈ స్థాయిలో మాట్లాడుతున్నప్పటికీ.. పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నప్పటికీ.. తనకు సంబంధించిన ఏ వార్తను కూడా సాక్షి మీడియాలో వేయరని కవిత క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు జగన్.. కేటీఆర్ మధ్య బలమైన బంధం ఉందని.. అందువల్లే తన వార్తలను సాక్షి మీడియాలో రాకుండా చూస్తారని కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి కవిత పార్టీ పెట్టిన దగ్గర నుంచి సాక్షి మీడియాలో ఒక వార్త గాని.. ఒక లైవ్ టెలికాస్ట్ గాని ఇంతవరకు రాలేదు. ఇప్పటివరకు ప్రధాన మీడియా సంస్థలు ఆమెతో ముఖాముఖి నిర్వహించాయి. కానీ సాక్షిలో మాత్రం ఇంతవరకు ఆమె ఇంటర్వ్యూ లేదా పాడ్ కాస్ట్ రాలేదు.
జగన్.. కేటీఆర్ మధ్య బలమైన బంధం ఉంది అని చెప్పడానికి గతంలో వారిద్దరు బెంగుళూరులో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విషయాన్ని గులాబీ పార్టీ మీడియా.. ఫ్యాన్ పార్టీ మీడియా బలంగా ఎక్స్పోజ్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ మీద ఈగ వాలినా కూడా జగన్ మీడియా సహించదు. ఒకరకంగా అది మరో నమస్తే తెలంగాణ లాగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో నమస్తే తెలంగాణను మించిపోతుంది. అందువల్లే కవిత వార్తలకు ప్రయారిటీ ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సేన నాయకులు అభిప్రాయపడుతున్నారు..
కేటీఆర్ సూచనల మేరకే జగన్ మీడియాలో కవితకు ప్రయారిటీ దక్కకుండా చూస్తున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకులు అంటున్నారు.. ఇటీవల కాలంలో నిజామాబాద్ ప్రాంతంలో కవిత సభ పెడితే.. దానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి వాహనాలను అద్దెకి తీసుకుంటే.. అందులో కూడా భూతద్దం పెట్టి చూసారని.. దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం చేశారని తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆరోపిస్తున్నారు. కవిత రాజకీయ ఎదుగుదలకు గులాబీ పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని.. తెలంగాణ సమాజం మొత్తం ఇదంతా గమనిస్తోందని.. కచ్చితంగా ఎన్నికల్లో బదులు జవాబు చెప్తారని తెలంగాణ రక్షణ సేన నాయకులు అంటున్నారు.
అయితే గతంలో కవిత రాజకీయ పార్టీ పెడతారని.. గులాబీ పార్టీ నుంచి బయటికి వస్తారని ఆంధ్రజ్యోతి వార్తలను ప్రసారం చేసింది. నాడు ఈ వార్తలను కవిత ఖండించారు. పైగా ఇదంతా కూడా కుట్ర అంటూ మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి కథనాలు క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనదైన శైలిలో కౌంటర్ కవిత ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఏబీఎన్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పైగా ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలు కూడా ఇచ్చారు.
View this post on Instagram