Google Data Center : వికాసం అనేది స్వతహాగా ఏర్పడదు. ఎంతోకొంత వినాశనం జరిగితేనే వికాసం ఉంటుంది. కాకపోతే వినాశనం లేకుండానే వికాసాన్ని ఏపీ ప్రజల ముందు ఉంచుతున్నది కూటమి ప్రభుత్వం.
వైజాగ్ నగరానికి వినూత్నమైన అవకాశాలు.. అపారమైన వనరులు ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఆధ్వర్యంలో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇటీవల దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. మొదట్లో డాటా సెంటర్ తన వల్లే వచ్చిందని జగన్ చెప్పుకున్నారు. ఆ తర్వాత డాటా సెంటర్కు వ్యతిరేకంగా స్వరం మార్చారు. అసలు విశాఖపట్నంలో డాటా సెంటర్ ఏర్పాటు అవసరం లేదని ఆయన చెబుతున్నారు. తన సొంత మీడియాలో డాటా సెంటర్ కు వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారు.
వైసిపి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంది. ఆ ముసుగులో కొంతమంది పర్యావరణవేత్తలు బయలుదేరారు. ముడసర్లోవ రిజర్వాయర్ లో ఇప్పుడు నీళ్లు లేవని.. రేపు విశాఖపట్నంలో google డాటా సెంటర్ కు నీళ్లు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించడం మొదలుపెట్టారు. విశాఖపట్నంలో గూగుల్ డాటా సెంటర్ వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుందని సరికొత్త పల్లవి అందుకోవడం ప్రారంభించారు. వాస్తవానికి google డాటా సెంటర్ అనేది కేవలం ముడసర్లోవ అనే జలాశయం ఆధారంగానే పనిచేయదు. పోలవరం నీళ్లను.. సముద్రపు నీళ్లను దీనికోసం ఉపయోగిస్తారు. Google డాటా సెంటర్ కోసం ప్రతి ఏడాది మూడు టీఎంసీల నీళ్లు ఇస్తే సరిపోతుంది. ఇప్పటికే ప్రతి ఏడాది వర్షాకాలంలో గోదావరి నది నుంచి దాదాపు వందల టిఎంసిల నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఆ నీటిని మొత్తం జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే ఇబ్బంది ఉండదు. పోలవరం నుంచి నీళ్లను విశాఖపట్నం నగరానికి తరలించి… తాగు, సాగునీటి అవసరాలు తీర్చిన తర్వాత google డాటా సెంటర్కు ఇస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైసీపీ మాట జనాలు నమ్మడం లేదని.. కొంతమంది మేధావులు వైసిపి ముసుగులో విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల సదస్సులు.. ర్యాలీలు నిర్వహిస్తూ తామేదో విశాఖపట్నం ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నట్టు బయలుదేరారు. వాస్తవానికి ఈ నాయకులు మొత్తం వైసిపి కోణంలో మాట్లాడుతూ ఉండడం అనేక రకాల అనుమానాలకు తావు ఇస్తోంది. ప్రపంచంలో అనేక దేశాలలో డాటా సెంటర్లు ఉన్నాయి. ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా ఆ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. డాటా సెంటర్లో ఏర్పాటు అయినత మాత్రాన ఆ ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండదు. ప్రజల జీవనానికి ఇబ్బంది ఉండదు. నేడు మన చుట్టూ ఎన్నో కాలుష్యకార కర్మ గారాలు ఉన్నాయి. ఎన్నో రకాల విధాలుగా కాలుష్యం జరుగుతోంది. ఆయనప్పటికీ ఎవరు నోరు మెదపరు. కానీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన డాటా సెంటర్ వల్ల విశాఖపట్నం నాశనం అవుతుందని కొంతమంది వాదించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీని వెనక ఎవరు ఉన్నారో అర్థమవుతోంది.