Ponguru Narayana: ఏపీ రాజకీయాలలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈ జిల్లాలో రాజకీయాలు చాప కింద నీరు లాగా సాగిపోతూ ఉంటాయి. కాకపోతే గత ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడంతో నెల్లూరు నిత్యం వార్తల్లో ఉండేది. నెల్లూరు ప్రాంతం నుంచి ఎంతో దిగ్గజమైన నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తమకంటూ కొత్త ముద్ర వేసుకున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్ లాగా మారిపోయాయి.
అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేసే వ్యక్తిగా..
నెల్లూరు టిడిపి రాజకీయాలను గతంలో చాలామంది నాయకులు కొనసాగించేవారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని పొంగూరు నారాయణ కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఈయన పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేసే వ్యక్తిగా నారాయణకు పేరుంది. అయితే ఈయనను ఇప్పుడు కొంతమంది నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా వైసిపి నుంచి నేతలు రోజుకు ఒకరు చొప్పున నారాయణ మీద విలేకరుల సమావేశాలు పెడుతున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.
నోరు వేసుకొని అరవడం తప్ప
ఆధారాలు ఉన్నాయని చెబుతున్న నాయకులు.. నోరు వేసుకొని అరవడం తప్ప.. ఇంతవరకు ఒక్క కాగితాన్ని కూడా చూపించలేదు. సొంత సాక్షి టీవీలో.. సోషల్ మీడియా గ్రూపులలో వాటిని పోస్ట్ చేయవచ్చు కదా.. కానీ ఆ పని వైసిపి నాయకులు చేయరు.. ఎందుకంటే నారాయణ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటమే వైసీపీ నాయకుల పని.. నెల్లూరులో ప్రతిరోజు వైసిపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ.. ఇంతవరకు నారాయణ కు వ్యతిరేకంగా ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేదు. కనీసం వైసిపి నాయకులు చేసిన ఆరోపణలకు తగ్గట్టుగా చర్చ కూడా జరగడం లేదు. నారాయణ తన పేరు మీద విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారు. భారీగా సంపాదించిన నారాయణ రాజకీయాల్లోకి వచ్చి అక్రమాలు చేశారంటే ఎవరైనా నవ్విపోతారు. పైగా ఆయన విద్యాసంస్థల ద్వారా భారీగానే ప్రతి ఏడాది లభిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆయనకు అక్రమాలు చేయాల్సిన అవసరం ఏముంది. గుమ్మం తలుపు తడితే విద్య.. వైద్యం.. వ్యక్తిగత ఆర్థిక అవసరాలను నారాయణ తీర్చుతారు. పైగా ఆయనకు మృదు స్వభావి అనే పేరు ఉంది. దాతృత్వంలో ఆయన కర్ణుడి లాగా ఉంటారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయన మీద ఇలా బురద చల్లడం సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టేనని టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు.
నెల్లూరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు
నారాయణ మీద విమర్శ చేస్తున్న వారిలో కాకాని గోవర్ధన్ రెడ్డి.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ఉన్నారు. వీరంతా ఎవరో కూడా నెల్లూరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద అక్రమ మైనింగ్. ఇసుక దందాలు. సెటిల్మెంట్లు వంటి విమర్శలు వచ్చాయి. చివరికి కోర్టు దస్త్రాలు కూడా మాయం చేశారు. ఇటువంటి వేలకోట్ల అవినీతికి పాల్పడిన వీళ్లు నారాయణ మీద విమర్శలు చేయడం నిజంగా హాస్యాస్పదం..
అన్ని స్థానాలను వైసీపీ కోల్పోయింది
వాస్తవానికి వీరు చేస్తున్న ఆరోపణలు వచ్చే నెల్లూరు నగరపాలిక ఎన్నికల గురించి అని అందరికీ అర్థమవుతుంది. 2024 అసెంబ్లీలో నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను వైసీపీ కోల్పోయింది. ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఈ నేపథ్యంలో నిరాశలో ఉన్న కార్యకర్తల్లో ఆశావాదాన్ని నింపేందుకు ఈ నాయకులు ప్రయత్నిస్తున్నారు గాని.. చేస్తున్న పని పూర్తిగా తప్పు. ఎందుకంటే నారాయణకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన శాఖలో అవినీతికి అవకాశం లేదు. నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలకు తావులేదు. నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో ఒకవేళ తమ సత్తా చాటాలి అనుకుంటే వైసిపి నాయకులు చేయాల్సింది వేరే ఉంది. అది వాళ్లకు అర్ధం కాదు.. చెప్పినా అర్థం చేసుకోలేరు.