Homeఎంటర్టైన్మెంట్Gunde Ninda Gudigantalu: 'గుండె నిండా గుడిగంటలు' బాలు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Gunde Ninda Gudigantalu: ‘గుండె నిండా గుడిగంటలు’ బాలు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Gunde Ninda Gudigantalu: బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్స్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ఏంటి ? అని అడిగితే మన అందరికీ గుర్తుకొచ్చే సీరియల్ ‘గుండె నిండా గుడి గంటలు’. ఈ సీరియల్ లో హీరో గా నటించిన విష్ణు అలియాస్ బాలు కి ఫ్యామిలీ ఆడియన్స్ , ఫిమేల్ ఆడియన్స్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ఎంత క్రేజ్ అంటే , […]

Gunde Ninda Gudigantalu: బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్స్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ఏంటి ? అని అడిగితే మన అందరికీ గుర్తుకొచ్చే సీరియల్ ‘గుండె నిండా గుడి గంటలు’. ఈ సీరియల్ లో హీరో గా నటించిన విష్ణు అలియాస్ బాలు కి ఫ్యామిలీ ఆడియన్స్ , ఫిమేల్ ఆడియన్స్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ఎంత క్రేజ్ అంటే , ఆయనకు వచ్చిన బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ని కూడా వదులుకునేంత. ఈ సీజన్ బిగ్ బాస్ 10 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు విష్ణు కి అవకాశం వచ్చింది. కానీ ఆయన ఆ ఆఫర్ ని చాలా సున్నితం గా రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే బాలు లేని ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ ని ప్రేక్షకులు చూడలేరు కాబట్టి.

ఎప్పుడైతే ఆయన ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ ని వదిలి ‘బిగ్ బాస్ 10’ లోకి రాబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో వచ్చిందో , అప్పటి నుండి అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. బాలు పాత్రలో నిన్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేము , దయచేసి బిగ్ బాస్ కి వెళ్లొద్దు, మాకు నువ్వే బాలు గా కావాలి అంటూ అభిమానులు గోల చేయడం తో , వాళ్ళ కోసం ‘బిగ్ బాస్ ‘ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు బాలు. అయితే బాలు కి బిగ్ బాస్ టీం ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?, వారానికి 6 లక్షల రూపాయిలు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కి కూడా ఇంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేయలేదు.

అలాంటిది బాలు ఎంత కోరితే అంత ఇవ్వడానికి టీం రెడీ అయ్యిందంటే , ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ‘గుండె నిండా గుడి గంటలు ‘ సీరియల్ చేస్తున్న విష్ణు కి , రోజు కి 50 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అంటే వారానికి 3 లక్షల 50 వేలు అన్నమాట. బిగ్ బాస్ తో పోలిస్తే ఈ ఆఫర్ చాలా చిన్నది. కానీ కేవలం తనని అభిమానించే అభిమానుల కోసమే బాలు అంత పెద్ద ఆఫర్ ని రిజెక్ట్ చేసాడట. ఒకవేళ బిగ్ బాస్ కి వచ్చి ఉండుంటే , బాలు కి ఇంకా ఎక్కువ రీచ్ వచ్చేది , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ కి నెంబర్ 1 రేటింగ్స్ వస్తున్నాయి. మరో వెయ్యి ఎపిసోడ్స్ నడిచేంత కెపాసిటీ కి ఈ సీరియల్ కి ఉంది. అలాంటి ప్రాజెక్ట్ ని వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశ్యం తోనే ‘బిగ్ బాస్’ ఆఫర్ ని వదులుకున్నాడట బాలు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper