Homeలైఫ్ స్టైల్Weight Loss : బరువు తగ్గడానికి.. ఆహారం మానేసింది.. చివరికి ఏమైందంటే..

Weight Loss : బరువు తగ్గడానికి.. ఆహారం మానేసింది.. చివరికి ఏమైందంటే..

Weight Loss : నేటి కాలంలో చాలామంది వ్యక్తిగత ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా లావుగా ఉండడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఊబకాయం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గుండె జబ్బులు.. ఇతర వ్యాధులు ఊబకాయం వల్ల సోకుతున్నాయి. అందువల్ల చాలామంది తమ ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నగా నాజూకుగా ఉండడానికి తాపత్రయపడుతున్నారు. ఒకప్పుడు వ్యాయామశాలలకు తక్కువ మంది వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిపోతుంది. […]

Weight Loss : నేటి కాలంలో చాలామంది వ్యక్తిగత ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా లావుగా ఉండడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఊబకాయం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గుండె జబ్బులు.. ఇతర వ్యాధులు ఊబకాయం వల్ల సోకుతున్నాయి. అందువల్ల చాలామంది తమ ఒంట్లో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నగా నాజూకుగా ఉండడానికి తాపత్రయపడుతున్నారు.

ఒకప్పుడు వ్యాయామశాలలకు తక్కువ మంది వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళల సంఖ్య అధికంగా ఉంటున్నది. అందువల్లే జిమ్ సెంటర్లు రద్దీగా ఉంటున్నాయి. కొంతమంది జిమ్ ల దాకా వెళ్లలేరు. అటువంటివారు తమ ఇండ్లలోనే ఉంటూ అదనపు బరువును తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి బరువులు తగ్గించుకోవడం అనేది మంచిది. కాకపోతే దానిని నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా మన శరీరం మీద ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తే చివరికి దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చైనా దేశంలో 31 సంవత్సరాల ఒక మహిళ బరువు తగ్గడానికి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. హెనాన్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ 160 సెంటీమీటర్లు ఎత్తు ఉండేది. 70 కిలోల బరువు ఉండేది. అయితే కఠినమైన డైట్ వల్ల ఆమె కొద్ది వారాల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గింది. బరువు తగ్గడంతో ఆమె అయోమయంలో పడిపోయింది. జ్ఞాపకశక్తిని కోల్పోయింది. చివరికి నాలుగు అడుగులు వేసే శక్తిని కూడా కోల్పోయింది. కళ్ళను తిప్ప లేకపోయింది. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆహారం తీసుకోకుండా.. కేవలం ఆమె నీటిని మాత్రమే తాగింది. ఫలితంగా ఇలా పూర్తిగా నీరస పడిపోయింది. శరీరంలో లవణాల స్థాయి తగ్గిపోవడంతో ఆమెకు ఈ దుస్థితి దాపురించింది. అయితే బరువు తగ్గాలి అనుకునేవారు ఇటువంటి ప్రయోగాలు చేస్తే చివరికి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గాలి అనుకుంటే కసరత్తులు చేయాలి. అవి కూడా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. శరీరానికి కావలసిన పోషకాహారాన్ని తీసుకోవాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. చక్కెర పదార్థాలను మితంగా తీసుకోవాలి. మధుమేహం వంటి రోగాలతో బాధపడేవారు వైద్యుల పర్యవేక్షణలోనే డైట్ పాటించాలి. అప్పుడే మన శరీరంలో బరువు తగ్గుతుంది. జీవనక్రియలు మెరుగ్గా సాగుతుంటాయి. అలాకాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. చివరికి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఎదురవుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper