Uday Bhanu: బుల్లితెర పై టాప్ మోస్ట్ యాంకర్స్ లిస్ట్ తీస్తే అందులో ఉదయ భాను పేరు లేకుండా ఉండదు. మన చిన్న తనం నుండి ఈమెని చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఐకానిక్ సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఈమె అప్పట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేది. ఆరోజుల్లో ఈమెకు సుమ కి మించి పాపులారిటీ ఉండేది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆ పాపులారిటీ తో ఈమెకు సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు కూడా క్యూలు కట్టాయి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఉదయ్ భాను, కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. అలా కెరీర్ లో ఫుల్ బిజీ గా మారిన ఉదయ్ భాను , అకస్మాత్తుగా ఇండస్ట్రీ లో కనిపించకుండా పోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎంతో బిజీ గా కనిపించే ఉదయ్ భాను అసలు ఏమైంది?, ఇండస్ట్రీ లోనే ఉందా?, లేదా ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోయిందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో తలెత్తాయి..
అయితే ఉదయ్ భాను ఇప్పుడు మళ్లీ సినీ రంగం లో యాక్టీవ్ అయ్యింది. ఈసారి నటిగా మాత్రమే కాదు , నిర్మాతగా కూడా మారింది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘పంచనామా’ వెబ్ సిరీస్ ని రీసెంట్ గానే జీ5 లో విడుదల చేయగా , దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ఈ సిరీస్ లో హీరో గా నటించాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్ కి 25 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయట. నిర్మాతగా ఉదయ్ భాను ఈ సిరీస్ తో చాలా పెద్ద సక్సెస్ ని అందుకుండానే చెప్పాలి. అయితే ఈ సిరీస్ విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో భాగంగా ఉదయ్ భాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె చెప్పిన కొన్ని పచ్చి నిజాలు వింటే, ఈ కాలం లో కూడా ఇలాంటివి జరుగుతాయా అని అనిపించక తప్పదు.
ఆమె మాట్లాడుతూ ‘రాజకీయాల్లోనే కాదు , సినిమాల్లో కూడా కులాలు రాజ్యం ఏలుతున్నాయి. నాకు ఎన్నో అవార్డ్స్ రావాల్సింది. మీకే ఈ అవార్డ్స్ అని చెప్పినవి కూడా వెనక్కి వెళ్లాయి. కారణం నా కులం. నాకే కాదు, ఇండస్ట్రీ లో చాలా మంది లేడీ యాంకర్స్ కి ఇది జరిగే ఉంటుంది. నేను కాస్త ధైర్యం గా , నిర్మొహమాటంగా ఉంటాను కాబట్టి , మీ ముందు ఇలా చెప్తున్నాను. కానీ మిగిలిన వాళ్ళు ఇంత ధైర్యం గా చెప్పలేరు’ అంటూ చెప్పుకొచ్చింది ఉదయ్ భాను.