Pawan Kalyan: నేడు రాఖీ పూర్ణిమ సందర్భంగా, సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా రాఖీ పండుగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. సినిమాల్లో చెల్లి సెంటిమెంట్ కి సంబంధించిన సాంగ్స్ తో నెటిజెన్స్ దుమ్ము లేపేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’ చిత్రం లోని ‘అన్నయ్యా అన్నావంటే ఎదురు అవ్వనా’ అనే పాట బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ అత్యధిక శాతం మంది ఈ పాటని అప్లోడ్ చేస్తూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉండగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రతీ పండుగని సంప్రదాయబద్ధంగా చేసుకునే సెలబ్రిటీల జాబితా తీస్తే మెగా ఫ్యామిలీ ముందు వరుస లో ఉంటుంది. ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కి రాఖీ పండుగ ఎంతో స్పెషల్.
ఆమెకు తన అన్నయ్య వరుణ్ తేజ్ తో పాటుగా, రామ్ చరణ్, అకిరా నందన్ వంటి వంటి వారు కూడా ఉన్నారు. వాళ్లకు ఈమె ప్రతీ రాఖీ పండుగ రోజు రాఖీ కడుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనో విచ్ కి రాఖీ కడుతూ దిగిన ఒక ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘నా చిట్టి తమ్ముడికి రాఖీ కడుతున్నాను’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. మార్క్ శంకర్ ని చాలా కాలం తర్వాత తమకు చూపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పవన్ ఫ్యాన్స్ నిహారిక ని ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఆ ఫోటో ని మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేరళలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆయన తన కుడి భుజానికి సర్జరీ చేయించుకోగా , డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట లెక్క చేయకుండా , ప్రభుత్వ విధుల్లోకి రావడంతో, సర్జరీ చేయించిన చోట వాపు రావడం తో , ఆయన వెంటనే కేరళలోని ఆయుర్వేద వైద్యం చేయించుకోవడానికి సిద్దమయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కేరళలోనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పటికీ , ఆయన మనసు మొత్తం ఇక్కడే ఉంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం లో 2500 మంది మహిళలకు నేడు రాఖీ పండుగ సందర్భంగా పట్టు చీరలు పంపించాడు పవన్ కళ్యాణ్.