Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ నియోజకవర్గం ఫిక్స్.. పోటీ అక్కడి నుంచే

Pawan Kalyan: పవన్ నియోజకవర్గం ఫిక్స్.. పోటీ అక్కడి నుంచే

Pawan Kalyan: పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ఆయన స్పష్టతనిచ్చారు.గత కొంతకాలంగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో పవన్ విశాఖలోని గాజువాక తో పాటు భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది నియోజకవర్గాల్లో పోటీచేయాలని స్థానిక జనసేన వర్గాలు పవన్ ను కోరుతూ వచ్చాయి.అందుకే ఈసారి తనకు అనువైన నియోజకవర్గాలను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు. కానీ ఓటమి ఎదురైన చోటే గెలుపొందాలని ఆయన భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గాజువాక తో పాటు భీమవరం నియోజకవర్గంలో మరోసారి బరిలో దిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు పవన్ గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ తాజాగా గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ తన పోటీపై స్పష్టతనిచ్చారు.

కాకినాడ,పిఠాపురం భీమవరం,గాజువాక, తిరుపతి, అనంతపురం తదితర నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట పవన్ పోటీ చేస్తారని గత రెండు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో… పవన్ ఎక్కడ పోటీ చేసినా గెలుపు తధ్యం అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందని.. మధ్యలో బిజెపి ఎంట్రీ తో ఆగిందని.. మరో రెండు మూడు రోజుల్లో పొత్తు ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డాలను పవన్ కలవనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో స్పష్టతనిచ్చారు. మరోసారి తాను భీమవరంలో పోటీ చేస్తానని జనసేన, టిడిపి నేతలతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈరోజు భీమవరంలో ఇరు పార్టీల శ్రేణులతో సమావేశమైన పవన్ సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి, జనసేన ఒంటరిగా పోరాటం చేయడంతో వైసిపికి విజయం దక్కింది. ఆ ఎన్నికల్లో పవన్ రెండో స్థానంలో నిలిచారు. రెండు పార్టీల ఓట్లు కలిపితే భారీ విజయం నమోదయ్యే పరిస్థితి ఉంది. అందుకే పవన్ భీమవరం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై పవన్ చంద్రబాబు తో మాట్లాడారని… ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే పవన్ ఈ విషయంలో పూర్తి స్పష్టత తీసుకున్నక.. రెండు పార్టీల నేతలను కలుసుకొని సహకరించాలని కోరారని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper