Raj Tarun: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు పోటీపడుతున్న యంగ్ హీరోలు సైతం చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో సక్సెస్ లభిస్తే మరి కొంతమందికి మాత్రం సరైన సక్సెస్ లు లేక చాలా వరకు డీలా పడిపోతున్నారు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ సైతం ఆ తర్వాత ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మామ’ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వత స్టార్ హీరో రేంజ్ కి వెళ్తాడు అనుకున్నప్పటికి ఆయన అనుకున్న రేంజ్ లో హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. కారణమేంటంటే తను మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు.
ముఖ్యంగా దిల్ రాజు ప్రొడక్షన్లో శర్వానంద్ హీరోగా వచ్చిన ‘శతమానం భవతి’ సినిమా కథని మొదట రాజ్ తరుణ్ కోసం అనుకున్నారు. అతనికి కథను వినిపించారు. తను హీరోగా అనౌన్స్మెంట్ కూడా వచ్చే సమయంలో తన దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్న రాజా రవీంద్ర ఆ కథ అంత ఎఫెక్టివ్ గా లేదని అది పెద్దగా ప్రేక్షకుడికి నచ్చదని చెప్పడంతో రాజ్ తరుణ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. మొత్తానికైతే శర్వానంద్ ఆ మూవీ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఇక ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఒక నేషనల్ అవార్డు కథ బాలేదని ఎలా రిజెక్ట్ చేశావు బ్రో అంటూ రాజ్ తరుణ్ ను అందరూ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ విషయంలో రాజ్ తరుణ్ కంటే కూడా రాజా రవీంద్ర నే ఆ కథను రిజెక్ట్ చేశాడట. తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది తెలుసుకున్న చాలా మంది ఒక కథ ను విన్నప్పుడు చాలా రకాలుగా దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఒక సక్సెస్ ఫుల్ స్టోరీ చేజారిపోయిందంటే మనకి ఒక భారీ సక్సెస్ మిస్ అయినట్టే అని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…