Malliswari Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మల్లీశ్వరి’ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. కామెడీ విత్ ఎమోషనల్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఈ సినిమా చూసే విధంగా చేసింది. ఇక ఇలాంటి క్రమంలోనే సీనియర్ నటుడు అయిన బాలయ్య కనిపించిన ప్రతిసారి అతని టేబుల్ మీద వైట్ కలర్ తో బ్లర్ అయి ఉంటుంది. ఇంతకీ ఆ బ్లర్ కి కారణం ఏంటి అని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది. కానీ అలా బ్లర్ చేయడానికి గల కారణం ఏంటంటే అతని టేబుల్ మీద ఒక జాతీయ జెండా ఉంటుంది. అది రివర్స్ లో పెట్టారట. అందుకే సినిమా రిలీజ్ అయిన 15 రోజుల తర్వాత మంచిర్యాలకు చెందిన ఒక అడ్వకేట్ దీని మీద కేసు వేయడంతో ఆ జెండా ఎక్కడెక్కడ అయితే కనిపిస్తుంది.
అక్కడ బ్లర్ అయితే చేశారు. మొత్తానికైతే సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని చాలా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఏమాత్రం తేడా జరిగినా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లీగల్ గా ప్రొసీడ్ అయితే మాత్రం సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో ప్రొడ్యూసర్లు తొందరగా తేరుకొని దానిని బ్లర్ చేశారు.
ఇక ఏది ఏమైనా కూడా సినిమా అనేది భారీ ఎత్తున డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విషయంలో చాలా వరకు ఆచితూచి ముందుకు సాగితే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం ప్రస్తుతం ఉన్న సినిమా మేకర్స్ కి ఒక క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు…
మొత్తానికైతే దాని మీద ఎవరు పెద్దగా ఫోకస్ చేయలేదు కాబట్టి మూవీ అలా నడిచి పోయింది. కానీ స్టార్ హీరోల సినిమాలో ఇలాంటివి ఏమైనా ఉంటే చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సినిమా మేకర్స్ ఇలా తో విషయాల్లో ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది…