Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli: సీనియర్ నటుడిని సిక్స్ ప్యాక్ చేయమని చెప్పిన రాజమౌళి...ఇంతకు ఆ నటుడు ఎవరంటే...

SS Rajamouli: సీనియర్ నటుడిని సిక్స్ ప్యాక్ చేయమని చెప్పిన రాజమౌళి…ఇంతకు ఆ నటుడు ఎవరంటే…

SS Rajamouli: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత ఆయన సింహాద్రి సినిమాను చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పటినుంచి టాప్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు అతనిని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటివరకు తను 12 సినిమాలు చేస్తే అందులో 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఆయన […]

SS Rajamouli: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత ఆయన సింహాద్రి సినిమాను చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పటినుంచి టాప్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు అతనిని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పటివరకు తను 12 సినిమాలు చేస్తే అందులో 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఆయన సక్సెస్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. రాజమౌళి ఒక సినిమాలోని షాట్ పెర్ఫెక్ట్ గా రావడం కోసం చాలావరకు కష్టపడతాడు. తన తోటి నటులను సైతం కష్టపెడుతాడు. అందుకే రాజమౌళి సినిమాలో నటించిన నటులు చాలా వరకు కష్టాలను పడుతుంటారు. వాళ్ళు ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో కూడా ఈ విషయాన్ని చెబుతుంటారు.

కానీ వాళ్ళు ఎంత కష్టమైతే పడతారో దానికి మించిన ప్రతిఫలం అయితే దక్కుతుందనేది వాస్తవం…ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా ఇద్దరు కూడా సిక్స్ ప్యాక్స్ తో కనిపించారు. వీళ్ళ పక్కనే ఉండే నాజర్ ఎప్పుడు షర్టు లేకుండా ఉంటాడు. అతను ఫ్యామిలీ ప్యాక్ తో కనిపించాడు.

నేను ఒక్కడినే ఫ్యామిలీ ప్యాక్ తో ఉన్నాను రాజమౌళి అని చెబితే రాజమౌళి కాసేపు ఆలోచించి మీరు కూడా కష్టపడితే మీకు సిక్స్ ప్యాక్ వస్తుంది చేయండి సార్ అని చెప్పాడట. దానికి నాజర్ షాక్ అయ్యారట. దాంతో నాజర్ ఈ ఏజ్ లో సిక్స్ ప్యాక్ ఏంటి రాజమౌళి అంటూ రాజమౌళితో మాట్లాడే ప్రయత్నం చేశాడట. కానీ రాజమౌళి మాత్రం నాజర్ ఒప్పుకుంటే అతని చేత కూడా సిక్స్ ప్యాక్ ను చేయిద్దాం అనే ఆలోచనలో ఉన్నాడట.

ఒక నటుడు స్క్రీన్ మీద ఎలా కనిపించాలి అనేది డైరెక్టర్ డిసైడ్ చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళ పాత్ర హైలెట్ అయితే దాని వెనకాల ఉన్న దర్శకుడు ఎలివేట్ అవుతాడనే ఉద్దేశ్యంతో రాజమౌళి తన సినిమాలో ప్రతి పాత్రను తనకు అనుకూలంగానే మార్చుకొని తన స్టైల్లో నటింపజేసుకుంటూ ఉంటాడు. అందుకే అతనికి ఇండస్ట్రీ లో చాలా మంచి క్రేజ్ ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper