Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana: ఉత్తరాంధ్రలో సీన్ అర్థమైందా.. బొత్స సత్యనారాయణ కన్నీరు మున్నీరు

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రలో సీన్ అర్థమైందా.. బొత్స సత్యనారాయణ కన్నీరు మున్నీరు

Botsa Satyanarayana: రాజకీయాలు ఒకే విధంగా సాగవు. ఒక విధంగా సాగిపోతుంటే వాటిని రాజకీయాలు అనరు. విజయనగరం జిల్లాలో రాజకీయాలలో మకుటం లేని మహారాజు లాగా వెలిగిపోయారు బొత్స సత్యనారాయణ. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా సరే.. విజయనగరంలో మాత్రం తనకు రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేవారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స మంత్రిగా ఉండేవారు. ఆయన తన సతీమణీని జెడ్పీ చైర్ పర్సన్ గా చేసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలం గడిచిపోయింది. ఆయన కొడుకు జమానాలో […]

Botsa Satyanarayana: రాజకీయాలు ఒకే విధంగా సాగవు. ఒక విధంగా సాగిపోతుంటే వాటిని రాజకీయాలు అనరు. విజయనగరం జిల్లాలో రాజకీయాలలో మకుటం లేని మహారాజు లాగా వెలిగిపోయారు బొత్స సత్యనారాయణ. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా సరే.. విజయనగరంలో మాత్రం తనకు రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేవారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స మంత్రిగా ఉండేవారు. ఆయన తన సతీమణీని జెడ్పీ చైర్ పర్సన్ గా చేసుకున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలం గడిచిపోయింది. ఆయన కొడుకు జమానాలో కూడా బొత్స మంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ ను విపరీతంగా తిట్టిన బొత్స.. ఆ తర్వాత జగన్ ను భుజాల కట్టుకున్నారు. అభినవ రాజశేఖర్ రెడ్డి అంటూ కీర్తించారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో బొత్స తిరుగులేని స్థాయిలో ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించారు.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తన సొంత జిల్లాకు మేనల్లుడు మజ్జి శ్రీను ను జడ్పీ చైర్మన్ గా నియమించుకున్నారు. తన జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఆయనను కొనసాగించారు. అధికారం పోయిన తర్వాత బొత్స కు కాళ్ల కింద భూమి కంపించి పోతోంది. రాజకీయాలు ఆయన కోరుకున్నట్టుగా సాగడం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

బొత్స కు ఒక వయసు వచ్చింది కాబట్టి ఆయన రాజకీయాలలో కొత్తగా చేయడానికి లేదు. కానీ మజ్జి శ్రీను అలా కాదు కదా. ఆయనకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. త్వరలో తన కూతుర్ని జడ్పీ చైర్మన్ చేయాలని అనుకుంటున్నారు. అందువల్లే వైసీపీలో ఉంటే లాభం లేదనుకొని.. టిడిపిలో చేరారు. స్థానిక ఎన్నికల ముందు మేనల్లుడు ఇలాంటి పనిచేయడంతో బొత్సకు ఏమీ అర్థం కావడం లేదు. విలేకరుల సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. వాస్తవానికి బొత్స ఏడవడం ఇది తొలిసారి కాదు. కాకపోతే ఈసారి ఆయన ఏడుపుకు బలమైన కారణం ఉంది. దాని వెనుక లోకేష్ ఉన్నాడు. ఆయన అపర రాజకీయ చాణక్యం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్థానిక ఎన్నికల్లో లోకేష్ ప్లాన్ ఎలా ఉందో బొత్సకు ముందే అర్థమైంది.

ఉత్తరాంధ్ర ప్రాంతం వైసిపికి ఒకప్పుడు కంచుకోట లాగా ఉండేది. 2024 ఎన్నికల్లో దీనిని కూటమి బద్దలు కొట్టింది. ఇప్పుడు అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలలో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. దీని వెనక ఉన్నది నారా లోకేష్. ఆయన స్కెచ్ వేస్తే ఎలా ఉంటుంది.. గట్టిగా అనుకుంటే ఎలా ఉంటుంది.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు ఉత్తరాంధ్రలో జరుగుతున్నది అదే.. రేపటి స్థానిక ఎన్నికల్లో ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేయకపోతే ఆశ్చర్యపోవాలి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper