Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: జగన్ లో ఓ కాక్రోచ్ ఉన్నాడు

YS Jagan: జగన్ లో ఓ కాక్రోచ్ ఉన్నాడు

YS Jagan: ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోవడం.. 11 స్థానాలకే పరిమితం కావడం.. సొంత పార్టీ నేతలు అనేక రకాల కేసులలో ఇరుక్కోవడం.. విచారణలు ఎదుర్కోవడం.. ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించడం.. అమరావతి నిర్మాణాన్ని అత్యంత వేగవంతం చేయడం వంటి పరిణామాలు జగన్ లో ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందువల్లే ఆయన ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తున్నారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఆ […]

YS Jagan: ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోవడం.. 11 స్థానాలకే పరిమితం కావడం.. సొంత పార్టీ నేతలు అనేక రకాల కేసులలో ఇరుక్కోవడం.. విచారణలు ఎదుర్కోవడం.. ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించడం.. అమరావతి నిర్మాణాన్ని అత్యంత వేగవంతం చేయడం వంటి పరిణామాలు జగన్ లో ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందువల్లే ఆయన ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తున్నారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత సొంత మీడియాలో భజన చేయించుకుంటున్నారు.

అదేదో సినిమాలో వచ్చాడు.. వెళ్ళాడు రిపీట్ అన్నట్టుగా జగన్ విలేకరుల సమావేశాన్ని సాగిస్తున్నారు. సొంత మీడియాకు ఇది ఇబ్బంది కాకపోయినప్పటికీ.. భజన యూట్యూబ్ చానల్స్ కు ఇది తప్పనిసరి తంతు కాబట్టి సరిపోతోంది. కానీ విశ్లేషకులకు మాత్రం జగన్ మాట్లాడిన ప్రతి మాట తలనొప్పి తెచ్చిపెడుతోంది ఎందుకంటే ఆయన మాట్లాడే ఏ మాటలో కూడా వాస్తవం కాదు కదా కనీసం లాజిక్ కూడా కనిపించడం లేదు. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ డీఎస్సీ వ్యవహారం తనలో ఉన్న కాక్రోచ్ ను బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.

కాక్రోచ్ ఇప్పటికే రెండు ముక్కలు అయింది. వచ్చే ఎన్నికల నాటికి అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియదు. ఇంతవరకు ఆ పార్టీ అధికారికంగా గుర్తింపు కూడా సాధించలేదు. క్షేత్రస్థాయిలో బలం లేదు. ఏదో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది కాబట్టి.. దానిని చూపిస్తూ కాక్రోచ్ కు బలం ఉంది అనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి లేదు.

డీఎస్సీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అనేక రకాలుగా వివరణలు ఇస్తూనే ఉంది. అధికారులు ముందుకు వచ్చి చేస్తున్న ప్రతి ఆరోపణకు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. చివరికి కోర్టులలో కేసులు వేస్తే కూడా అవి వీగిపోతున్నాయి. అలాంటప్పుడు డీఎస్సీలో అక్రమం జరిగిందని వైసిపి.. ఇతర తోక చానల్స్ ఎలా అంటాయి.. వార్తలను ఎలా ప్రసారం చేస్తాయి.. డీఎస్సీ మీద కొన్ని చానల్స్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అందులో పనిచేసే ఉద్యోగులు బయటికి వెళ్లిపోతున్నారు. దీనిని బట్టి డీఎస్సీ లో ఎటువంటి అక్రమం జరగలేదని అర్థమవుతుంది.. అలాంటప్పుడు ఇంకా దీని మీద విష ప్రచారం చేయడం దేనికని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు జగన్ ఎందుకు విలేకరుల ముందుకు వస్తున్నారు.. ఎందుకు కాక్రోచ్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారో అనేది అర్థం కావడం లేదు. నిజానికి డీఎస్సీ మీద అక్రమాలు జరిగాయి అనుకుంటే వైసిపి కోర్టుకు వెళ్లొచ్చు. అక్కడ తన వద్ద ఉన్న ఆధారాలను చూపించవచ్చు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు. కానీ దీనిని వైసీపీ చేయడం లేదు. అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రకు శ్రీకారం చుట్టారని అర్థమవుతోంది. ఇది ప్రజలకు తెలుసు కాబట్టి జగన్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయన కాక్రోచ్ అన్నప్పటికీ యువత పెద్దగా స్పందించడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper