Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Interview with Venkat Krishna: తీవ్రవాదులతోనే ఫైట్ చేశా.. నువ్వెంత జగన్.. వెంకటకృష్ణ ముందు...

Chandrababu Interview with Venkat Krishna: తీవ్రవాదులతోనే ఫైట్ చేశా.. నువ్వెంత జగన్.. వెంకటకృష్ణ ముందు బరెస్ట్ అయిన ‘బాబు’

Chandrababu Interview with Venkat Krishna: ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కీలకమైన తల్లికి వందనం పథకానికి ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాలో నిధులు జమ చేశారు. మరోవైపు అనుకూల మీడియాలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్, జర్నలిస్టు వెంకటకృష్ణ వేసిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవే వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందని.. రాజకీయాలకే చీడపురుగులా తయారయ్యారని.. అటువంటి వ్యక్తిని రాజకీయాలనుంచి పారద్రోలాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. తీవ్రవాదులతోనే పోరాటం చేసే.. జగన్ ఒక లెక్క కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Also Read:  ABN RK – Virat Kohli : ఇదెక్కడి ఎడిటింగ్? దెబ్బకు ఆర్కే షాక్ లోకి వెళ్లడం ఖాయం!

1. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో మత కల్లోలం ఎలా నియంత్రించగలిగారు చెప్పుకొచ్చారు చంద్రబాబు. మతం మాటున జరిగిన ఉన్మాదాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయినట్లు చెప్పారు. అటు తరువాత జంట నగరాలు ప్రశాంతతకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

2.  రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతిని కూకటి వేళ్ళతో పెకిలించిన విషయాన్ని సైతం గుర్తు చేశారు. ప్రశాంత రాయలసీమ కోసం శాంతిభద్రతలను ఏ స్థాయిలో నియంత్రించింది చెప్పారు.

3.  రాజకీయ ముసుగులో జగన్ ఆడుతున్న నాటకాన్ని.. శివుడి పై ఉన్న తేలుతో పోల్చారు. శివలింగం అన్న భక్తితో తేలు ఆడుకుంటే.. రాజకీయం అనే ముసుగు వేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో.. వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

4.  తిరుపతి వెంకన్న సాక్షిగా తనపై జరిగిన హత్యాయత్నం నుంచి తప్పించుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

5.  కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సైతం కఠినంగా వ్యవహరిస్తానని తేల్చి చెప్పారు చంద్రబాబు. ఏబీఎన్ వెంకటకృష్ణ సాక్షిగా తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టారు. అదే వేదిక పైనుంచి జగన్ విషయంలో భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతున్నానో స్పష్టతనిచ్చారు చంద్రబాబు. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

6.  నిన్నటికి నిన్న ఈనాడు మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు. భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి గట్టి హెచ్చరికలే పంపగలిగారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular