Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీPhone Battery Tips: ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్స్ తో ఫుల్ బ్యాకప్..

Phone Battery Tips: ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్స్ తో ఫుల్ బ్యాకప్..

Phone Battery Tips: స్మార్ట్‌ఫోన్ వాడేవారు బ్యాటరీ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కువ సేపు వినియోగించడం వల్ల త్వరగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. అయితే దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయి. చార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే కొన్ని ట్రిక్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫోన్లో కొన్నింటిని మార్చుకోవడం వల్ల కూడా బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్స్ ఏవో చూద్దాం.. పవర్ సేవింగ్ మోడ్: ఫోన్‌లో ఉన్న బ్యాటరీ సేవర్ లేదా Power Saving Modeను […]

Phone Battery Tips: స్మార్ట్‌ఫోన్ వాడేవారు బ్యాటరీ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కువ సేపు వినియోగించడం వల్ల త్వరగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. అయితే దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయి. చార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే కొన్ని ట్రిక్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫోన్లో కొన్నింటిని మార్చుకోవడం వల్ల కూడా బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్స్ ఏవో చూద్దాం..

పవర్ సేవింగ్ మోడ్:
ఫోన్‌లో ఉన్న బ్యాటరీ సేవర్ లేదా Power Saving Modeను ఆన్ చేస్తే బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. ఈ మోడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ, యానిమేషన్లు, ప్రాసెసింగ్ వేగం తగ్గుతుంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఫోన్ ఎక్కువసేపు పనిచేస్తుంది.

అవసరం లేని యాప్స్ ను తొలగించండి:
చాలా యాప్‌లు ఉపయోగించకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ బ్యాటరీని వాడుతూ ఉంటాయి. కాబట్టి అవసరం లేని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిది. అలాగే తరచుగా ఉపయోగించని యాప్‌లను పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ ఆదా అవుతుంది. కొన్ని యాప్‌లు ఫోన్ వాడకపోయినా నిరంతరం డేటాను సేకరిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. వీటిని బ్యాక్రౌండ్ యాక్టివిటీస్ సెట్టింగ్స్‌లో నిలిపివేస్తే బ్యాటరీ వినియోగం తగ్గుతుంది.

అవసరం లేనప్పుడు నెట్ ఆఫ్ చేయండి..:
లోకేషన్ , వైఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంటే బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బయట ఉన్నప్పుడు వైఫై, ఇంట్లో ఉన్నప్పుడు జీపీఎస్ ఆఫ్ చేయడం వంటి అలవాటు చేసుకోవాలి.

లైవ్ వాల్‌పేపర్లు, యానిమేషన్లు తగ్గించండి:
లైవ్ వాల్‌పేపర్లు, అధిక యానిమేషన్లు ఫోన్ ప్రాసెసర్‌పై అదనపు భారం పెడతాయి. సాధారణ స్టాటిక్ వాల్‌పేపర్ ఉపయోగించడం, అవసరం లేని యానిమేషన్ ఎఫెక్ట్‌లను తగ్గించడం వల్ల బ్యాటరీ ఎక్కువసేపు నిలుస్తుంది.

ఆటో సింక్‌ అవసరం లేదు..!
ఈమెయిల్, క్లౌడ్ స్టోరేజ్, సోషల్ మీడియా యాప్‌లు తరచుగా ఆటోమేటిక్‌గా సింక్ అవుతుంటాయి. దీని వల్ల బ్యాటరీతో పాటు మొబైల్ డేటా కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. అవసరం లేనప్పుడు ఆటో సింక్ ను ఆఫ్ చేసి, అవసరమైనప్పుడు మాత్రమే మాన్యువల్‌గా సింక్ చేయడం మంచిది.

అలాగే ప్రతి యాప్ నుంచి వచ్చే నోటిఫికేషన్‌లు స్క్రీన్‌ను తరచుగా యాక్టివ్ చేస్తాయి. దీంతో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఉపయోగించని యాప్‌ల నోటిఫికేషన్‌లను ఆఫ్ చేస్తే బ్యాటరీ ఆదా కావడంతో పాటు అనవసర అంతరాయాలు కూడా తగ్గుతాయి. స్మార్ట్‌ఫోన్‌లో అత్యధిక బ్యాటరీని వినియోగించే భాగం స్క్రీన్. కాబట్టి బ్రైట్‌నెస్‌ను అవసరమైనంత మేరకు మాత్రమే ఉంచాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper