Hari Hara Veeramallu VFX Shots: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం కోసం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు మరియు మూవీ లవర్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్ని అనుకున్న పద్దతిలో జరిగి ఉండుంటే నేడు ఈ చిత్రం విడుదల అయ్యుండేది. థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కళకళలాడేవి. కానీ అది జరగలేదు. VFX వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం తో ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. విడుదల తేదీపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. రీసెంట్ గానే ఇరాన్ నుండి ఒక ప్రముఖ VFX కంపెనీ లో ఈ చిత్రానికి సంబంధించిన 6000 VFX షాట్స్ ని కలెక్ట్ చేసుకొని వచ్చాడు ఆ చిత్ర డైరెక్టర్ జ్యోతి కృష్ణ. అందుకు సంబంధించిన ఫోటో ని కూడా ఆయన సోషల్ మీడియా లో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ VFX షాట్స్ అన్నిటిని సినిమాలో పొందుపరిచే పనిలో ఉన్నారు మేకర్స్.
Also Read: Pawan Kalyan: నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా మొదలు..డైరెక్టర్ ఎవరంటే!
ఇదంతా పక్కన పెడితే ‘ఆదిపురుష్’ చిత్రానికి దాదాపుగా 8000 VFX షాట్స్ ని ఉపయోగించారు. ఆ చిత్రం తర్వాతి స్థానం లో 6000 VFX షాట్స్ తో ‘హరి హర వీరమల్లు’ చిత్రం రెండవ స్థానంలో ఉంది. ప్రతీ VFX షాట్ ని 10 లేయర్స్ ఉండేలా చూసుకున్నారట. కేవలం సినిమాలోని చివరి పది నిమిషాలకు నిర్మాతలు దాదాపుగా 28 కోట్ల రూపాయిలు ఖర్చు చేసారంటే ఈ చిత్రాన్ని ఎంత భారీగా తీశారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు షూటింగ్ కి ముందు స్క్రిప్ట్ మొత్తాన్ని యానిమేషన్ రూపం లో Previz టెక్నాలజీ తో ఒక వీడియో ని కూడా రూపొందించారట. మొత్తం మీద ఈ చిత్రం పై 350 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలకు ఎన్ని VFX షాట్స్ ని ఉపయోగించారో ఒకసారి చూద్దాం.
Also Read: Pawan Kalyan Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ వీడియో విడుదల
బాలీవుడ్ లో 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి 4500 VFX షాట్స్ ని ఉపయోగించగా, ‘బాహుబలి 2’ కి 4500 షాట్స్, రావన్ చిత్రానికి 3000 షాట్స్, #RRR చిత్రానికి 2800 షాట్స్ ని ఉపయోగించారు. ఇలా భారీ బడ్జెట్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఉపయోగించిన VFX షాట్స్ కంటే ‘హరి హర వీరమల్లు’ సినిమాకు ఉపయోగించిన షాట్స్ ఎక్కువ. అంతే కాదు #RRR చిత్రం లో ‘యానిమల్’ షాట్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘హరి హర వీరమల్లు’ కి కూడా ఆ కంపెనీ నే పనిచేసింది. ఇందులో కూడా జంతువుల షాట్స్ చాలానే ఉంటాయట. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ
According to director @amjothikrishna, the film has around 6000 VFX shots, a record for an Indian film. Much before the shooting began, we had shot the entire film in animation for previsualization. Every VFX shot has 10 layers. We don’t want to… pic.twitter.com/9gL8tcnLIR
— Trend PSPK (@TrendPSPK) June 11, 2025