Homeఆధ్యాత్మికంToday 6 August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి...

Today 6 August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవం..

Today 6 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదనపు ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల పట్ల అనాసక్తి ఉంటుంది. కొందరు వ్యాపారులకు […]

Today 6 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదనపు ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల పట్ల అనాసక్తి ఉంటుంది. కొందరు వ్యాపారులకు చెడు చేయాలని అనుకుంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరి జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ఉద్యోగులు తోటి వారి సహాయంతో ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. దగ్గర స్నేహితులే కొందరు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొన్ని రహస్యాలను బయట వారికి చెప్పకుండా ఉండాలి. వ్యాపారులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరి సహాయంతో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరిలో ఉత్సాహం ఉండడంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల అండదండలతో పెట్టుబడులు పెడతారు. పాత పరిచయాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. అనవసరంగా ఎక్కువగా మాట్లాడకూడదు. కొన్ని విషయాల్లో మౌనమే పనిచేస్తుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. మానసికంగా సంతోషంగా గడుపుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దలను గౌరవించాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు పెద్దల అండదండలు ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొన్ని విషయాల్లో ఆలోచించడమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి పాత స్నేహితులు కలుస్తారు. దీంతో వీరు ఈరోజు సరదాగా గడుపుతారు. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరపు వాగ్దానాలు చేయకూడదు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయాల్లో అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తోటి వారి సహాయంతో ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులపై ప్రత్యేక ప్రేమను పంచుతారు. బంధువుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. స్నేహితుల సహాయంతో అప్పుల నుంచి బయటపడతారు. వ్యాపారులకు ఈరోజు అన్నీ కలిసి వస్తాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వీరితో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణం ద్వారా ఆర్థికంగా బలపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper