Dharmapuri Arvind: రాజకీయ నాయకులు ఒకప్పుడు విమర్శలు చేసుకునేవారు. ఆ తర్వాత ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏకంగా వ్యక్తిగత దూషణలదాకా వచ్చాయి.
విమర్శలు.. ఆరోపణలు.. వ్యక్తిగత దూషణలు.. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి.. ప్రత్యర్థుల మీద అభియోగాలు మోపుకుంటున్నారు. ఇది కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తుంటే.. మిగతా వారికి మాత్రం ఇదేంటి రాజకీయాలు ఇలా అయిపోతున్నాయని బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ రాజకీయ నాయకులు ఊరుకోవడం లేదు. కేవలం ప్రత్యర్థుల మీద బురద చిమ్మడానికి.. ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనివల్ల రాజకీయాలు అంటేనే ఏవగింపు కలుగుతుంది.
అధికారంలో ఉన్న నాయకులు తాము చేసిన అభివృద్ధి గురించి.. ప్రజలు చేసిన మేలు గురించి చెప్పుకోగలగాలి. విపక్షంలో ఉన్న నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలకు అన్యాయం జరిగితే నేరుగా రంగంలోకి దిగి నిరసనలకు పాల్పడాలి. కానీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చాలా విచిత్రంగా సాగుతున్నాయి. నాయకులు పోటాపోటీగా విమర్శలు.. ఆరోపణలు.. వ్యక్తిగత దూషణలు.. అభియోగాలు దాటిపోయి.. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రత్యర్థుల మీద తమకున్న కోపాన్ని.. ఇంకా రకరకాల ఆవేశాలను వేరే విధంగా తీర్చుకుంటున్నారు.
తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి ప్రస్తావన ఉంది. రేవంత్ రెడ్డి తీరును ఆయన విమర్శిస్తూ ఒక వీడియో రూపొందించారు. అందులో తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన ఒక మ్యాప్ రూపొందించారు. తెలంగాణ సరిహద్దుల్లో అరేబియా మహాసముద్రం.. బంగాళాఖాతం.. హిందూ మహాసముద్రం.. హిమాలయ పర్వతాలు అందులో ఉన్నట్టు చూపించారు. ఇదీ రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ.. ఇందులో హైడ్రా కూడా ఉంటుంది అని అరవింద్ క్యాప్షన్ ఇవ్వడం విశేషం.
అరవింద్ రూపొందించిన ఈ వీడియో లో రేవంత్ మీద ఉన్న ఆయనకు ఉన్న కోపం కనిపిస్తోంది. అయితే నేరుగా ఆయన విమర్శించకుండా.. టెక్నాలజీ సాయంతో ఆయన చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేసే విధంగా ఈ వీడియో రూపొందించారు. ఈ వీడియోను బిజెపి శ్రేణులు విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. గతంలో మోడీ మాట్లాడిన మాటలను.. బిజెపి పెద్దలు మాట్లాడిన మాటలను.. ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు.. మొత్తానికి అరవింద్ తీసుకొచ్చిన వీడియో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితిని మార్చేసింది.
రేవంత్ రెడ్డి ‘నూతన తెలంగాణా’ మ్యాప్ చూస్తరా??
️ హిమాలయాలు, బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సముద్రం, హిందూ మహా సముద్రం….అగ్గో,, HYDRAA కూడా ఉన్నది!! pic.twitter.com/dWXSLYIOpc
— Arvind Dharmapuri (@Arvindharmapuri) August 5, 2026