Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana: బొత్స పై కూటమి గురి!

Botsa Satyanarayana: బొత్స పై కూటమి గురి!

Botsa Satyanarayana: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. పిసిసి అధ్యక్షుడి గా పని చేశారు. ఒకానొక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి పదవికి వినిపించింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన.. బీసీ నాయకుడిగా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. వైసీపీ కాపు రాజకీయాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ ను వ్యక్తిగతంగా నిర్వీర్యం చేయాలని […]

Botsa Satyanarayana: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. పిసిసి అధ్యక్షుడి గా పని చేశారు. ఒకానొక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి పదవికి వినిపించింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన.. బీసీ నాయకుడిగా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. వైసీపీ కాపు రాజకీయాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ ను వ్యక్తిగతంగా నిర్వీర్యం చేయాలని చూస్తోంది కూటమి. విజయనగరం తో పాటు విశాఖలో ఆయన బలాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది.

* అనతి కాలంలోనే ఎదిగి..
ఒక సహకార సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన బొత్స అనతి కాలంలోనే విజయనగరం పై పూర్తి పొట్టు సాధించారు. తన కుటుంబ రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో తన వారే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని సక్సెస్ అయ్యారు. చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గం వర్గాల్లో తన సొంత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సైతం తన మేనల్లుడు కు దక్కేలా చేసుకున్నారు. అయితే బొత్స హవాపై దృష్టి పెట్టారు మంత్రి నారా లోకేష్. మొన్నటి ఎన్నికల్లో గురిపెట్టి కొట్టడంతో విజయనగరంలో పూర్తిగా కూలిపోయింది బొత్స కోట.

* కారణం అదే..
అయితే మళ్లీ బొత్స ఇప్పుడు కాపు రాజకీయంతో వైసీపీకి కాపు కావాలని చూస్తున్నారు. దానికి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు అని భావిస్తోంది కూటమి. అందుకే బొత్స కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో వైసిపి పూర్తిగా నిర్వీర్యం అయ్యేలా చూస్తోంది. వైసీపీ నుంచి టిడిపి తో పాటు జనసేనలో చేరికల సంఖ్య పెంచాలని భావిస్తోంది. గజపతినగరం నియోజకవర్గంలో బొత్స అప్పల నరసయ్య ఉండగా అక్కడ వైసీపీ శ్రేణులు టిడిపిలోకి క్యూ కడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయంలో పట్టు బిగిస్తున్నారు.

* చీపురుపల్లిలో ఖాళీ చేసేలా.
మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గం లో సైతం వైసీపీ శ్రేణులను ఆకర్షించేందుకు కిమిడి కళా వెంకట్రావు ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున సైతం వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం లో సైతం వైసీపీ శ్రేణుల్లో విభేదాలు పతాక స్థాయిలో ఉన్నాయి. వాటిని సైతం క్యాష్ చేసుకునే పనిలో ఉంది టిడిపి కూటమి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా వైసిపిని నిర్వీర్యం చేసి కూటమి వైపు టర్న్ చేసుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ఉన్నారు మంత్రి నారా లోకేష్. బొత్స పై పూర్తిగా దృష్టిపెట్టారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper