Homeఆంధ్రప్రదేశ్‌Pithapuram Development: పిఠాపురమా మజాకా.. ఏంటండీ ఆ ట్రెండింగ్!

Pithapuram Development: పిఠాపురమా మజాకా.. ఏంటండీ ఆ ట్రెండింగ్!

Pithapuram Development: మొన్నటి ఎన్నికల వరకు పిఠాపురం ఒక సామాన్య నియోజకవర్గం. నవ్యాంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో అది ఒకటి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని కోరుకున్నారో.. పొత్తులో భాగంగా ఆ సీటును కైవసం చేసుకున్నారో.. నాటి నుంచి ఆ నియోజకవర్గ ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత ఒక మార్మోగిపోయింది. పైగా అక్కడ గెలిచిన పవన్ మంత్రి గానే కాకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పటినుంచి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అయితే […]

Pithapuram Development: మొన్నటి ఎన్నికల వరకు పిఠాపురం ఒక సామాన్య నియోజకవర్గం. నవ్యాంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో అది ఒకటి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని కోరుకున్నారో.. పొత్తులో భాగంగా ఆ సీటును కైవసం చేసుకున్నారో.. నాటి నుంచి ఆ నియోజకవర్గ ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత ఒక మార్మోగిపోయింది. పైగా అక్కడ గెలిచిన పవన్ మంత్రి గానే కాకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పటినుంచి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో మైలురాయి దాటారు. రోడ్ల విప్లవం సృష్టించారు. నియోజకవర్గంలో పక్కా రహదారులను నిర్మిస్తూ… ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

* రోడ్ల వ్యవస్థలో మార్పులు..
పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు.. ఏకంగా రూ.207 కోట్ల అంచనా తో 307 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ శాఖల నిధులను సమర్ధవంతంగా వినియోగిస్తూ.. ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో 611 రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. 80% పైగా పనులు పూర్తి కావడంతో పిఠాపురం పల్లెలు, పట్టణాలు రహదారులతో కలకలలాడుతున్నాయి.

* దేశంలోనే రోల్ మోడల్ గా..
నియోజకవర్గ రూపురేఖలను మార్చుతున్నారు. దేశంలోనే ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా పిఠాపురంను తీర్చిదిద్దుతున్నారు. 13 సంవత్సరాల కిందట సముద్ర కోతతో ఇల్లు కోల్పోయారు చాలామంది మత్స్యకారులు. కొత్త మాయా పట్నం, కొత్త సూరాడ పేట పునరావాస కాలనీలో ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ఉప్పాడ జెట్టి మార్గం,, అమరవిల్లి – రామన్నపాలెం బీచ్ రోడ్.. ఎస్సీ జడ్ పరిధిలోని ముమ్మిడి వారి పాడు, గొల్లప్రోలు- తాటిపర్తి, కొండవరం వంటి మారుమూల గ్రామాలు, చివరకు స్మశాన వాటికల దాకా రహదారులను నిర్మించారు. చివరకు పొలాలను విడిచిపెట్టలేదు. పొలాల మధ్య డొంక రోడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. మొత్తానికైతే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం మరోసారి ట్రైనింగ్ లో నిలిచింది సోషల్ మీడియాలో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper