Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Steel Bridge: అమరావతి- విజయవాడ.. మధ్యలో ఇదో అద్భుతం

Amaravati Steel Bridge: అమరావతి- విజయవాడ.. మధ్యలో ఇదో అద్భుతం

Amaravati Steel Bridge: అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధానికి ప్రధాన రవాణా మార్గంగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఈనెల 13న ప్రారంభం కానుంది. మరోవైపు విజయవాడ నుంచి అమరావతికి వచ్చే మార్గంలో ఉండవల్లి సమీపంలో రెండు స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం జరగగా.. అందులో ఒకటి పూర్తయింది. దానిని సైతం ప్రారంభించనున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ అటు అమరావతికి.. ఇటు విజయవాడకు అనుసంధానంగా ఉండనుంది. ప్రస్తుతం కరకట్టపై నుంచి ప్రయాణించే వారంతా.. ఇకపై సీడ్ […]

Amaravati Steel Bridge: అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధానికి ప్రధాన రవాణా మార్గంగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఈనెల 13న ప్రారంభం కానుంది. మరోవైపు విజయవాడ నుంచి అమరావతికి వచ్చే మార్గంలో ఉండవల్లి సమీపంలో రెండు స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం జరగగా.. అందులో ఒకటి పూర్తయింది. దానిని సైతం ప్రారంభించనున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ అటు అమరావతికి.. ఇటు విజయవాడకు అనుసంధానంగా ఉండనుంది. ప్రస్తుతం కరకట్టపై నుంచి ప్రయాణించే వారంతా.. ఇకపై సీడ్ ఆక్సిస్ రోడ్డుపై నేరుగా అమరావతి వెళ్ళవచ్చు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డులో ఉండవల్లి లోని బంకింగ్ హామ్ కాలువపై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో స్టిల్ బ్రిడ్జి కొండవీటి వాగుపై 284 మీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

* సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం..
స్టీల్ బ్రిడ్జిని సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేశారు. ప్రస్తుతం లింక్ అప్రోచ్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. దాదాపు కొలిక్కి వచ్చాయి. సీడ్ ఆక్సిస్ రోడ్డుతో పాటు ఈ స్టీల్ బ్రిడ్జిలను సైతం ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఉండవల్లి కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖద్వారం కూడా. ఆ దగ్గరలోనే బకింగ్ హామ్ కాలువ, కొండవీటి వాగులపై స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. అయితే ఇవి కేవలం రవాణా పరంగా కాదు. పర్యాటకంగానూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

* పర్యాటక హంగులు..
ఈ స్టీల్ బ్రిడ్జిల దగ్గర ఉండే అప్రోచ్ రోడ్లకు రెండువైపులా అరుదైన మొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జిని చూసేందుకు.. రెండు బ్రిడ్జిల మధ్య ఒక ప్రాంతాన్ని వ్యూ పాయింట్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు వెంట వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయి. అదే సమయంలో గ్రీన్ జోన్ ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికైతే అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వస్తుండడం శుభపరిణామం. అటు స్టీల్ బ్రిడ్జిలు సైతం అందుబాటులోకి వస్తుండడంతో అమరావతికి, ఆపై విజయవాడకు కొత్త రూపు రానుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper