HomeతెలంగాణTeenmar Mallanna: శ్రీ చైతన్య ర్యాంకులు మొత్తం బోగస్.. అసలు నిజం బయటపెట్టిన తీన్మార్ మల్లన్న.....

Teenmar Mallanna: శ్రీ చైతన్య ర్యాంకులు మొత్తం బోగస్.. అసలు నిజం బయటపెట్టిన తీన్మార్ మల్లన్న.. వైరల్ వీడియో

Teenmar Mallanna: జాతీయస్థాయి పోటీ పరీక్షల ఫలితాలు విడుదలైనప్పుడు.. ఎక్కువ ర్యాంకులు మాకే వచ్చాయని శ్రీ చైతన్య యాజమాన్యం చెబుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో.. ప్రింట్ మీడియాలో భారీగా ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. జాతీయ ర్యాంకులు మొత్తం తమకే వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటుంది. ఇలా మీడియాకు ప్రకటనలు ఇచ్చి శ్రీ చైతన్య యాజమాన్యం భారీగా విద్యా వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఒక అంచనా ప్రకారం వేలకోట్ల వ్యాపారం శ్రీ చైతన్య కాలేజీ ద్వారా జరుగుతూ ఉంటుందని విమర్శలున్నాయి. […]

Teenmar Mallanna: జాతీయస్థాయి పోటీ పరీక్షల ఫలితాలు విడుదలైనప్పుడు.. ఎక్కువ ర్యాంకులు మాకే వచ్చాయని శ్రీ చైతన్య యాజమాన్యం చెబుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో.. ప్రింట్ మీడియాలో భారీగా ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. జాతీయ ర్యాంకులు మొత్తం తమకే వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటుంది.

ఇలా మీడియాకు ప్రకటనలు ఇచ్చి శ్రీ చైతన్య యాజమాన్యం భారీగా విద్యా వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఒక అంచనా ప్రకారం వేలకోట్ల వ్యాపారం శ్రీ చైతన్య కాలేజీ ద్వారా జరుగుతూ ఉంటుందని విమర్శలున్నాయి. శ్రీ చైతన్య యాజమాన్యం వ్యవహార శైలిని ఎప్పటినుంచో తీన్మార్ మల్లన్న దీర్ఘంగా పరిశీలిస్తున్నారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్ లో కార్పొరేట్ యాజమాన్యాల దందాను బయటపెట్టారు. అంతటితో ఆగకుండా నేరుగా శ్రీ చైతన్య యాజమాన్యం దగ్గరికి వెళ్లారు. వెళ్లడం మాత్రమే కాదు శ్రీ చైతన్య యాజమాన్యం మొత్తాన్ని కడిగిపారేశారు.

ఇటీవల జాతీయస్థాయి పోటీపరీక్షల ఫలితాలు విడుదలైనప్పుడు శ్రీ చైతన్య యాజమాన్యం తమ విద్యార్థులు 3,500 మంది మెరుగైన ర్యాంకులు సాధించారని పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. దీంతో ఈ విషయాన్ని బయట పెట్టేందుకు మల్లన్న నేరుగా రంగంలోకి దిగారు. శ్రీ చైతన్య యాజమాన్యం దగ్గరికి వెళ్లారు. ర్యాంకులు సాధించిన 3500 మంది విద్యార్థుల వివరాలు ఇవ్వమని కోరారు. దానికి యాజమాన్యం నిరాకరించడంతో అసలు విషయాన్నీ బయటపెట్టారు. శ్రీ చైతన్య యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు మొత్తం బోగస్ అని.. వేరే కాలేజీలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను తమ విద్యార్థులుగా శ్రీ చైతన్య యాజమాన్యం పేర్కొంటున్నదని మల్లన్న ఆరోపించారు. అదే కాదు శ్రీ చైతన్య యాజమాన్యం తీరును బయట పెడతామని.. తెలంగాణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతామని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.

హైదరాబాదులోని నారాయణగూడ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ క్యాంపస్ వద్దకు వెళ్లి అక్కడ సిబ్బందితో మాట్లాడారు. అక్కడ విలేకరులతో లోపల జరిగిన వ్యవహారాన్ని మొత్తం బయటపెట్టారు. తద్వారా కార్పొరేట్ విద్య పేరుతో శ్రీ చైతన్య యాజమాన్యం దోచుకుంటున్న తీరును ఆయన బయటపెట్టారు. వచ్చే రోజుల్లో శ్రీ చైతన్య దోపిడి నిర్వాకాన్ని సాక్షాలతో సహా వివరిస్తామని మల్లన్న ప్రకటించారు. మరి మల్లన్న ఆ మాట మీద ఉంటారా.. శ్రీ చైతన్య యాజమాన్యం మీద యుద్ధాన్ని కొనసాగిస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper