Uppal Balu: కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ వచ్చే నెల 6 వ తేదీ నుండి గ్రాండ్ గా మొదలు కాబోతుంది. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. మొన్ననే ‘అగ్ని పరీక్ష 2’ కి సంబంధించిన షూటింగ్ మొదలైంది. 25 వేల అప్లికేషన్స్ నుండి కేవలం 61 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. వీరికి వివిధ లెవెల్ లో ఆడిషన్స్ ని నిర్వహించి , బిగ్ బాస్ హౌస్ లోకి కేవలం 6 నుండి 8 మంది సామాన్యులను పంపబోతున్నారు. గత సీజన్ లో సామాన్యుడు అయినటువంటి కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ అవ్వడం తో , ఈ సీజన్ లో సామాన్యులపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.
ఇకపోతే మొదటి రోజు షూటింగ్ ఎవరెవరు ఎంపిక అయ్యారు , ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు అనేది చూశాము. రాజా కుమారి దయానా, మితిలేష్ లిఫ్ట్స్ , లైఫ్ ఆఫ్ సుమ.. ఈ ముగ్గురు నేరుగా చివరి రౌండ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చారు జడ్జీలు. ఇది ఇలా ఉండగా ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ కి ఉప్పల్ బాలు కూడా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈయన్ని ముగ్గురు జడ్జీలు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి రిజెక్ట్ చేశారట. ఉప్పల్ బాలు అనే వ్యక్తి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన సెలబ్రిటీ స్థాయిలోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతాడేమో అని అందరూ అనుకున్నారు. అలాంటి వ్యక్తిని ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ కి పిలవడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అయితే, ఆయన్ని రిజెక్ట్ చేయడం మరో షాకింగ్ విషయం అనే చెప్పాలి.
వాస్తవానికి ఉప్పల్ బాలు ని మెయిల్ లోనే రిజెక్ట్ చేశారట. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , చివరి నిమిషం లో ఆయనకు ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆడిషన్స్ లో రిజెక్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా రెండవ రోజు షూటింగ్ లో రిజెక్ట్ అయినటువంటి కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకసారి చూస్తే ఆర్య పుష్ప, మ్యారీ రోజీ, పంపరి భరత్, అక్షయ్ రాజ్, విశిష్ట, రాక్ స్టార్ సిద్దు, రన్నింగ్ రాజా, శ్రీవాణి నాయుడు వంటి కంటెస్టెంట్స్ కి ముగ్గురు జడ్జీలు రెడ్ ఫ్లాగ్ ఇచ్చి రిజెక్ట్ చేశారట. ముఖ్యంగా అక్షయ్ రాజ్ అనే వ్యక్తిని రిజెక్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇతను ఇన్ స్టాగ్రామ్ లో పాపులర్ ట్రోలర్.
ఈయన్ని ముగ్గురు జడ్జీలు ఒక రేంజ్ లో ట్రోలింగ్ , రోస్టింగ్ చేసి రిజెక్ట్ చేశారట. ఇక రెండవ రోజున ఎవరికీ కూడా జడ్జీలు మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి ఫైనల్ రౌండ్ కి పంపలేదు అట. కేవలం రెండు రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి హోల్డ్ లో పెట్టారట. వాళ్ళ జాబితా ని ఒకసారి చూస్తే షాలినీ పటేల్, అమన్ మసూద్, అభిజ్ఞ వంటి వారికి రెండు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. వీళ్ళు తదుపరి రౌండ్ లో పెట్టే టాస్కులు గెలిస్తే చివరి రౌండ్ కి వెళ్తారు. ఇదే విధంగా ఈ రెండు రోజుల షూటింగ్ కలిపి కేవలం ఒకే ఒక్క గ్రీన్ ఫ్లాగ్ ని సొంతం చేసుకొని డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఒకసారి చూద్దాం. సాక్షిత రాజ్ పుత్ , గౌరీ త్రినేత్ర , రోహిత్ నాయుడు. ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు కదా , వీళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అని పొరపాటు పడొద్దు, గతం లో శ్రీజ దమ్ము కూడా ఇలాగే డేంజర్ జోన్ లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె జడ్జీల మెప్పు పొంది , బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి , ఏ రేంజ్ కంటెంట్ ఇచ్చిందో మనమంతా చూసాము, వీరిలో కూడా అలాంటి కంటెస్టెంట్ ఉండొచ్చు.