Homeఅంతర్జాతీయంFCRA Amendment Bill: ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు : మత సంస్థల కూసాలు కదులుతున్నాయి.. అమిత్...

FCRA Amendment Bill: ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు : మత సంస్థల కూసాలు కదులుతున్నాయి.. అమిత్ షా వద్దకు క్యూ

FCRA Amendment Bill: కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన విదేశీ నిధుల నియంత్రణ(ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు స్వచ్ఛంద సంస్థలకు శరాఘాతంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడే సంఘాలకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ బిల్లుపై ప్రస్తుతం వర్షాకాల సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈ బిల్లు విదేశీ నిధులు అందుకునే సంస్థల ఆస్తుల నిర్వహణపైకు కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో విదేశీ నిధులు పొందే క్రిష్టియన్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల క్రై […]

FCRA Amendment Bill: కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన విదేశీ నిధుల నియంత్రణ(ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు స్వచ్ఛంద సంస్థలకు శరాఘాతంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడే సంఘాలకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ బిల్లుపై ప్రస్తుతం వర్షాకాల సమావేశాల్లో చర్చ జరగనుంది. ఈ బిల్లు విదేశీ నిధులు అందుకునే సంస్థల ఆస్తుల నిర్వహణపైకు కొత్త నిబంధనలు రానున్నాయి. దీంతో విదేశీ నిధులు పొందే క్రిష్టియన్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల క్రై స్తవ మత పెద్దలు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించాలని కోరారు. లేదంటే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపాలని కోరారు.

క్రై స్తవ ప్రతినిధుల సమావేశం..
ఆగస్టు 6న వివిధ క్రై స్తవ సంప్రదాయాల ప్రతినిధులు, కాథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు, జాయింట్‌ యాక్షన్‌ ఫోరమ్‌ ఆన్‌ మైనారిటీస్‌ నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి. విల్సన్‌ నేతృత్వంలోని ఈ బృందం బిల్లును ఉపసంహరించాలని లేదా విస్తృత సంప్రదింపుల కోసం జేపీసీకి పంపాలని కోరింది. ప్రత్యేకంగా ఆస్తులు ప్రభుత్వ నియమిత అధికారికి బదలాయించే నిబంధనను తొలగించాలని, పాత చట్టంలోని సంబంధిత సెక్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా వంటి ఈశాన్య రాష్ట్ర నాయకులు కూడా ఇలాంటి ఆందోళనలు వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. అమిత్‌షా వారి సూచనలను సానుకూలంగా విన్నట్లు తెలిసింది.

బిల్లులోని కీలక ప్రతిపాదనలు
ఎఫ్‌సీఆర్‌ఏ 2010 చట్టానికి సవరణగా వచ్చిన ఈ బిల్లు, రిజిస్ట్రేషన్‌ రద్దు, సరెండర్‌ లేదా ఆటోమేటిక్‌గా ముగిసినప్పుడు విదేశీ నిధులతో ఏర్పాటైన ఆస్తుల నిర్వహణకు డిజిగ్నేటెడ్‌ అథారిటీని నియమించాలని చెబుతోంది. మొదట తాత్కాలికంగా, తర్వాత శాశ్వతంగా ఆ ఆస్తులు ఆ అధికారికి వెస్ట్‌ కావచ్చు. రెన్యువల్‌లో జాప్యం లేదా కొన్ని సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికేట్‌ నిలిచిపోయే అవకాశం, కనీస వినియోగ పరిమితి వంటి నిబంధనలు కూడా ఉన్నాయి. జైలు శిక్షను తగ్గించడం, విచారణలకు కేంద్ర అనుమతి వంటి మార్పులు కూడా ప్రతిపాదితమయ్యాయి.

ఎందుకు ఆందోళన..
క్రై స్తవ సంస్థలు, విద్యా–వైద్య–సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే అనేక ఎన్‌జీవోలు విదేశీ విరాళాలతో పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ఆస్తులు నిర్మించాయి. రిజిస్ట్రేషన్‌ సమస్య వచ్చినప్పుడు ఆ ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. దీంతో దాతృత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చని వాదిస్తున్నారు. ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాలు, కేరళ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న చోట ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెరిగిన పర్యవేక్షణ వంటివి ఆందోళనకు కారణాలుగా చెబుతున్నారు. కొందరు దీనిని సివిల్‌ సొసైటీ స్వేచ్ఛపై నియంత్రణ పెంచే చర్యగా చూస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు..
ప్రభుత్వం బిల్లు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదని చెబుతోంది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని నివారించి, పారదర్శకత పెంచి, జాతీయ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమని వివరిస్తోంది. అమిత్‌షా సమావేశాల్లో బిల్లు పూర్వానువర్తనం కాదని, ఏ మతాన్ని బాధపెట్టే ఉద్దేశం లేదని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. దేశంలోకి వచ్చే విదేశీ విరాళాల్లో క్రై స్తవ సంస్థల వాటా పరిమితమేనని గణాంకాలు చూపించారు.

ఈ బిల్లు ఆగస్టు 12న చర్చకు రావచ్చని సూచనలు ఉన్నాయి. సమావేశం ముగిసే ముందు దీన్ని ఆమోదించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అమిత్‌షా మరిన్ని సంప్రదింపులు నిర్వహించవచ్చు. కొన్ని నిబంధనల్లో సడలింపులు లేదా స్పష్టతలు రావచ్చు. జేపీసీకి పంపే అవకాశం లేదా ప్రస్తుత రూపంలోనే ముందుకు సాగే అవకాశం రెండూ ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper