spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ Nagababu  : నాగబాబు కోసం బిజెపి డ్రాప్!

 Nagababu  : నాగబాబు కోసం బిజెపి డ్రాప్!

Nagababu  : ఏపీ ( Andhra Pradesh) నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) రాజీనామా ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులను సైతం వదులుకున్నారు. మరో మూడున్నర ఏళ్ల రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. కచ్చితంగా ఈ రాజ్యసభ సీటు కూటమికి దక్కుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో.. కూటమికి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ పదవి తమ పార్టీకి కావాలని.. మూడు పార్టీల నేతలు కోరుకుంటున్నారు. అయితే ఈసారి జనసేనకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది.

* అప్పట్లో తప్పుకున్న జనసేన
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో మస్తాన్ రావు తో పాటు మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్ కృష్ణయ్య బిజెపికి మద్దతు ప్రకటించారు. దీంతో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే తొలుత కూటమిలోని మూడు పార్టీలు మూడు పదవులను సర్దుకుంటాయని అంతా భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ రెండు రాజ్యసభ సీట్లు దక్కించుకోగా.. బిజెపి ఒకటి తీసుకుంది. జనసేనకు చాన్స్ లేకుండా పోయింది. టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు తో పాటు సానా సతీష్ కు పదవి దక్కింది. బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్య తిరిగి ఎన్నికయ్యారు. అయితే చివరి వరకు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ జనసేనకు చాన్స్ లేకుండా పోయింది.

* చివరి నిమిషంలో ఛాన్స్ మిస్
అయితే సమీకరణలో భాగంగా నాగబాబుకు( Nagababu ) అవకాశం లేకుండా పోయిందని.. ఆయనను ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు చాన్స్ ఇచ్చి.. తరువాత క్యాబినెట్ లోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. నాగబాబుకు రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు రాజ్యసభకు పంపి.. ఏపీలో మరో బిజెపి నేతకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం ప్రారంభం అయింది.

* నాగబాబు కోరిక అదే
వాస్తవానికి ఏపీ మంత్రి కంటే రాజ్యసభకు( Rajya Sabha ) వెళ్లాలన్నది నాగబాబు అభిప్రాయం. తొలినుంచి పెద్దల సభకు వెళ్లాలని నాగబాబు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీలో మరొకరికి మంత్రి పదవి ఖాయం అయినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో బిజెపి 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన సత్య కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. అయితే మంత్రివర్గంలో ఒక పదవి ఖాళీగా ఉంది. నాగబాబు కోసమే ఆ పదవి అంటూ ఇప్పటివరకు అంతా భావించారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని బిజెపి నేతతో భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటారనుకున్న నాగబాబు.. రాజ్యసభకు వెళితే.. రాష్ట్ర మంత్రిగా బిజెపి నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి అయితే నాగబాబు కోసం బిజెపి డ్రాప్ అయ్యిందన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper