Orange Re Release Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటించిన సినిమాలలో కొన్ని అట్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘ఆరెంజ్'(Orange Movie Rerelase). బొమ్మరిల్లు, పరుగు వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత భాస్కర్, ‘మగధీర’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ కలిసి చేసిన సినిమా కావడంతో అప్పట్లో భారీ అంచనాలతో విడుదల అవ్వడం, ఆ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం వంటివి జరిగాయి. నిర్మాత నాగబాబు ని ఆర్ధిక సంక్షోభం లోకి నెట్టేసిన సినిమా కూడా ఇదే. అయితే ఈ చిత్రం లోని పాటలు విడుదలకు ముందు పెద్ద హిట్ అయ్యాయి. ఇక విడుదల తర్వాత అయితే యూత్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసింది. ఈ పాటలకు ఉన్న విలువ ఎలాంటిదో రీసెంట్ గా ఈ చిత్రం రీ రిలీజ్ అయినప్పుడు నేటి తరం ఆడియన్స్ కి మరోసారి అర్థమైంది.
గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే సెన్సేషన్ సృష్టించింది. మొదటి రీ రిలీజ్ లో నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రెండవ రీ రిలీజ్ లోనూ అదే తరహా రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సినీ సెలబ్రిటీస్ సైతం ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదలైన ఈ సినిమా, అప్పుడే దిగ్విజయం గా 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ 5 రోజులు ఈ సినిమాకి వచ్చినంత వసూళ్లు లేటెస్ట్ గా విడుదలైన కొత్త సినిమాలకు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 రోజుల్లో 2 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
మొదటి రీ రిలీజ్ కి రెండవ రీ రిలీజ్ కి కలిపి చూస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 6 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. ఊపు చూస్తుంటే అప్పట్లో నాగబాబు(Nagababu) నష్టపోయిన డబ్బులను ప్రతీ ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తే , ఆ నష్టాలు రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమాలో స్క్రీన్ ప్లే లోపం ఉన్నప్పటికీ కూడా జనాలు రీ రిలీజ్ లలో అలా ఎగబడి చూస్తున్నారంటే అందుకు కారణం హరీష్ జయరాజ్ అందించిన పాటలు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ పాటని వినే కొద్దీ వినాలని అనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. అదే ఈ పాటల్లో ఉన్న స్పెషల్. అందుకే ఎన్ని సార్లు రీ రిలీజ్ చేసినా ఈ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ తగ్గిపోదు. ఇకపోతే ఈ చిత్రానికి హైదరాబాద్ లో వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ పడడాన్ని చూసి కొన్ని షోస్ ని పెంచిన సంఘటన ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.