Bhogapuram International Airport: ప్రజలు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకునేది కొందరే. అలాంటి అరుదైన అవకాశం దక్కించుకునేది కూడా కొందరి. అయితే తక్కువ వయసులో గొప్ప అవకాశాన్ని పొందారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దానికి కారణం ఆయన ఉత్తరాంధ్రకు చెందిన వారు. ఇంతటి పెద్ద ప్రాజెక్టులో ఆయన భాగస్వామ్యం అయ్యారు. మరో 50 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దానిని నిర్మించారు. అంటే భావితరాలు తప్పకుండా రామ్మోహన్ నాయుడు సేవలను గుర్తు చేసుకుంటాయి. అది గొప్ప వరం ఆయనకు. అరుదైన అవకాశం కూడా. అయితే సొంత ప్రాంతంలో ఇటువంటి కీర్తి సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు నిర్మించారు. కానీ అన్నిటికంటే భోగాపురం అనేది రామ్మోహన్ నాయుడుకు గొప్ప వరం లాంటిది అని చెప్పవచ్చు.
* జగన్ కు ఆ ఛాన్స్ వచ్చింది..
చిన్న వయసులో చాలామందికి అవకాశాలు వస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకునే వారు కొందరే. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం ఇటువంటి అవకాశం వచ్చింది. కానీ ఆయన మూడు రాజధానులు అని ప్రకటించుకున్నారు. ఉన్న అమరావతిని నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. తాను తలపెట్టిన మూడు రాజధానులను అమలు చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు జగన్తో పోల్చుకొని రామ్మోహన్ నాయుడును ఎక్కువమంది అభినందిస్తున్నారు. మూడు రాజధానులను నిర్ధారించుకొని.. వాటిని పట్టాలెక్కించే పని చేయలేదు. జగన్ వైఖరి విమర్శలకు గురిచేస్తే.. రామ్మోహన్ నాయుడు చొరవ మరో తరం కూడా చెప్పుకునేందుకు అవకాశం ఉంది. జగన్ మాదిరిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు రామ్మోహన్ నాయుడు. పౌర విమానయాన శాఖను దక్కించుకొని స్వల్ప కాలంలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో మాత్రం ఆయన పాత్ర ఉందనేది ప్రజలకు తెలుసు. ఇప్పటికీ ఆయన పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు సానుకూలతతో ఉంటారు. ఈ భోగాపురం ప్రాజెక్టుతో మాత్రం చరిత్రలో నిలిచిపోయే అరుదైన చాన్స్ దక్కించుకున్నారు.
* ప్రత్యేక చొరవతో..
గత రెండేళ్ల కూటమి పాలనలో.. ఎన్డీఏ ప్రతినిధిగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం ఎంపీగా ఉన్న ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ స్థాయిలో పని చేశారో తెలియంది కాదు. చంద్రబాబు మార్గదర్శకంలో పనిచేసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరితగతిన పూర్తి చేయడంలో ఆయన కృషి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు ప్రారంభోత్సవానికి. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ తో పాటు యంత్రాంగమంతా ఉంది. కానీ ప్రజల దృష్టి మాత్రం రామ్మోహన్ నాయుడు పై ఉంది. ఆయన కృషి వల్లే 50 సంవత్సరాలకు సరిపడా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. నిజంగా రామ్మోహన్ నాయుడు చిన్నపిల్లాడు కావచ్చు. కానీ పెద్ద మనసుతో చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు అని చెప్పడం అతిశయక్తి కాదు.