The Paradise Movie: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ గతంలో ప్రచారం చేశారు. కానీ అది అనుకున్న మేరకు వర్కౌట్ కాలేదు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. ఇక ఆగస్టు 6వ తేదీన ఈ సినిమా నుంచి ఒక టీజర్ రాబోతుంది. మరోసారి ప్రేక్షకుల్లో విశేషమైన బజ్ ను క్రియేట్ చేసుకోవడానికి శ్రీకాంత్ ఓదెల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తాడు. ప్రేక్షకుల్లో ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటాడా? తనదైన రీతిలో సినిమాని తెరకెక్కించాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం టీజర్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ టీజర్ లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కథను రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
నిజానికి ఈ సినిమా కథ ఏంటంటే 1960 బ్యాక్ డ్రాప్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ‘ప్యారడైజ్’ అనే ఒక వైశ్య గృహం ఉండేది. అందులో మగ్గిపోతున్న కొంతమంది వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి బతుకుతూ ఉంటారు. అలాంటి ఒకవేళ వేశ్య కి పుట్టిన కొడుకే మన హీరో నాని… ఆయన వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని ఎలా సాల్వ్ చేశాడు అనేదే ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఆయన ఈ సినిమాకి ప్లస్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. నాని సైతం ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తాడనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. దసరా కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నప్పటికి సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు ఏదీ క్లారిటీగా నమ్మలేము అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…