Homeఆంధ్రప్రదేశ్‌Gannavaram Airport: భోగాపురం ముగిసింది.. గన్నవరం విషయంలో..చంద్రబాబు నిర్ణయం ఇదే

Gannavaram Airport: భోగాపురం ముగిసింది.. గన్నవరం విషయంలో..చంద్రబాబు నిర్ణయం ఇదే

Gannavaram Airport: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయం ఇటీవల ప్రారంభమైంది. ఇక్కడ నుంచి సర్వీసులు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇక్కడ మెరుగైన వసతులు కల్పించడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు మొదలైన నేపథ్యంలో.. ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం గురించి చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాలలో గన్నవరం ముందు వరుసలో ఉంటుంది. ఇవి మన […]

Gannavaram Airport: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయం ఇటీవల ప్రారంభమైంది. ఇక్కడ నుంచి సర్వీసులు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇక్కడ మెరుగైన వసతులు కల్పించడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి.

భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు మొదలైన నేపథ్యంలో.. ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం గురించి చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాలలో గన్నవరం ముందు వరుసలో ఉంటుంది. ఇవి మన ఫ్రేమ్ విస్తరణ చేపట్టాలని కొంతకాలంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయానికి సంబంధించి కేంద్రానికి ఏపీ ప్రభుత్వం కీలకమైన ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ విమానాశ్రయం సంబంధించి తమ ప్రణాళికలను వెల్లడించిందని తెలుస్తోంది.

గన్నవరం విమానాశ్రయంలో కొత్త నిర్మాణాలకు సంబంధించి కేంద్ర పావుర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలకమైన విషయాలను బయటపెట్టారు. గన్నవరంలో ఆధ్యాత్మిక ఇంటిగ్రేటెడ్ థర్మల్ నిర్మాణం జరుగుతోందని వివరించారు. విమానాశ్రయాన్ని ఇటీవల ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో టెర్మినల్ పనులను పరిశీలించారు. అధికారులు కూడా అక్కడ జరుగుతున్న పనులను మంత్రికి వివరించారు. త్వరలోనే ఈ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. గతంలో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల నిర్మాణ పనులు జపించడం జరిగిందని మంత్రి ఒప్పుకున్నారు.

కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించడంతో అవి యుద్ధం ప్రాతిపదికన జరుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు ఈసందర్భంగా వివరించారు.పనులు జరుగుతున్న సమయంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయని .. సవాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని.. వీటన్నింటినీ ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. చంద్రబాబు సూచనల మేరకు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నామని.. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడటం లేదని ఆయన వివరించారు. భోగాపురం తరహాలోనే ఇక్కడ విమానాశ్రయంలో కల్చరల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి వివరించారు. కృష్ణానది.. దుర్గమ్మ సన్నిధి ఆకృతిలో టెర్మినల్ నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దసరా నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్లను ఆదేశించారు. గన్నవరం నుంచి వస్తున్న ట్రాఫిక్ తో పాటు.. ఇంకా అనేక రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. దీంతో భోగాపురం సరసన గన్నవరం నిలిచే అవకాశం ఉంది. సర్వీసులు గనక ప్రారంభమైతే గన్నవరం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రజలకు మరింత ఉన్నతంగా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper