Homeఆంధ్రప్రదేశ్‌Anna Lezhneva: పవన్ భార్య ఆశ్చర్యకర ప్రకటన!

Anna Lezhneva: పవన్ భార్య ఆశ్చర్యకర ప్రకటన!

Anna Lezhneva: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది. జంతు ప్రేమికుడు కూడా. అది చాలా సందర్భాల్లో చూసాం. అయితే ఆయన భార్య అన్నా లెజినోవా సైతం ఇప్పుడు భర్త మార్గంలోనే నడుస్తున్నారు. తన భర్త మాదిరిగానే జంతువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జంతు సంరక్షణకు ఏకంగా ఆరు లక్షల 30 వేల రూపాయలను అందించారు. అది కూడా తన పుట్టినరోజు సందర్భంగా. ఇప్పటివరకు ఆమె పేరు అన్నా లెజినోవా. అయితే ఇక […]

Anna Lezhneva: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది. జంతు ప్రేమికుడు కూడా. అది చాలా సందర్భాల్లో చూసాం. అయితే ఆయన భార్య అన్నా లెజినోవా సైతం ఇప్పుడు భర్త మార్గంలోనే నడుస్తున్నారు. తన భర్త మాదిరిగానే జంతువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జంతు సంరక్షణకు ఏకంగా ఆరు లక్షల 30 వేల రూపాయలను అందించారు. అది కూడా తన పుట్టినరోజు సందర్భంగా. ఇప్పటివరకు ఆమె పేరు అన్నా లెజినోవా. అయితే ఇక నుంచి తన పేరును అన్నా కొణిదల గా మార్చుకున్నారు. తనను అలాగే పిలవాలని కోరారు. వాస్తవానికి ఆమె ఈ దేశస్తురాలు కాదు. కానీ పవన్ భార్యగా మారిన తర్వాత ఇక్కడి వాతావరణాన్ని.. ఇక్కడి సంప్రదాయాలను.. వస్త్రధారణను గౌరవించారు. ఒక సాధారణ హిందూ గృహిణిగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా తన పేరు మార్పు, ఆపై జంతు ప్రేమ వ్యక్తం చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం అభినందనలు అందుకుంటుంది.

* జంతువుల దత్తత…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. ఆయన వైవాహిక జీవితం పై అనేక రకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు ప్రత్యర్ధులు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటిని పట్టించుకోలేదు. తన వ్యక్తిగత జీవితం కోసం విమర్శలు చేసిన ప్రతిసారి ఆయన స్పందిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన భార్య అన్నా కొణిదల పవన్ బాటలోనే నడుస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విశాఖ జూలాజికల్ పార్కులో ఒక ఆసియా ఏనుగును, బెంగాల్ టైగర్ ను దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటి ఆహారంతో పాటు సంరక్షణకు అవసరం అయినా ఆరు లక్షల 30 వేల రూపాయలను పార్కు అధికారులకు అందించి తన మంచి మనసును చాటుకున్నారు. ఆ రెండు జంతువులను దత్తత తీసుకోవడంతో జూలాజికల్ పార్క్ అధికారులు ఆమె ఫోటోతో సహా అక్కడ ఏర్పాట్లు చేశారు. వాటిని చూస్తున్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* గతంలో పవన్ సైతం..
గతంలో పవన్ కళ్యాణ్ సైతం తన పుట్టినరోజు నాడు జంతువుల ఆహారంతో పాటు సంరక్షణకు కొంత మొత్తం సొంత నిధులను అందించారు. విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు గతంలో నగదు కేటాయించారు. ఇప్పుడు అదే మార్గంలో భార్య అన్నా కొణిదల నడుస్తుండడం నిజంగా గొప్ప విషయం. అడవుల అన్నా.. గిరిజన ప్రాంతాలు అన్నా.. పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం. అందుకే ఆయన తనకు ఇష్టమైన అటవీ శాఖను తీసుకున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన భార్య సైతం తన పుట్టినరోజు నాడు మూగజీవాల కోసం.. వాటి సంరక్షణతో పాటు ఆహారం కోసం నిధులు అందించడం మాత్రం గొప్ప విషయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper