AP DSC 2025 : డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏడాదిన్నర కిందట కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. అయితే ఇందులో అవకతవకులు చోటు చేసుకున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కానీ అందుకు తగ్గ ఆధారాలు మాత్రం చూపించలేకపోతోంది. ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా సరిగ్గా చూపించలేక కేవలం అనుమానాలతోనే ఆందోళనలు జరుపుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా అడ్డుకునే ఎత్తుగడ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో గ్రూప్ పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగినట్టు మాత్రం కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందం వైసిపి హయాంలో ఉద్యోగాల విక్రయాలు, అవకతవకలు పూసకు గుచ్చినట్లు కోర్టులో వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే వైసిపి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థి సంఘాల నుంచి కానీ.. రాజకీయ పార్టీల నుంచి కానీ ఎటువంటి మద్దతు లేదు. ఇప్పుడు గ్రూప్ పరీక్షల్లో అవకతవక్కలపై మాత్రం విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు గళం ఎత్తే అవకాశం ఉంది.
* సిట్ దర్యాప్తు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో గ్రూప్ 1 నియామకాలు జరిగాయి. అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమి వచ్చిన వెంటనే దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణకు నియమించింది. ప్రస్తుతం సిట్ పక్కా ఆధారాలతో ఒక రిపోర్ట్ తయారు చేసింది. హైకోర్టుకు సమర్పించిన తుది నివేదికతో అప్పట్లో జరిగిన అవకతవకలు కోర్టు ముందు ఉంచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యంత హేయమైన కుట్రగా అభివర్ణించింది. నాటి ప్రభుత్వ పెద్దల ప్రత్యక్ష ఆశీస్సులు, ఆదేశాల మేరకు గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అని ఆధారాలు చూపించింది సిట్. ఏకంగా 7 కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీల నివేదికలు, 173 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఒకే జవాబు పత్రాన్ని మూడుసార్లు మూల్యాంకనం చేయడం పూర్తిగా చట్టవీరుద్దం. కానీ నాడు ఈ మార్గం ఎంచుకోవడం వెనుక అనేక రకాల అవకతవకలు ఉన్నాయని సీట్ కోర్టుకు స్పష్టం చేసింది.
* రికార్డులు తారుమారు..
అప్పట్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో 452 మంది అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ పానెల్ ను పక్కన పెట్టారు. కేవలం 66 మంది ప్రైవేటు డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టుకుని.. విజయవాడ, హాయ్ ల్యాండ్ రిసార్ట్లలో మూల్యాంకన రికార్డులను ఉంచి తారుమారు చేశారు అనేది సిట్ దర్యాప్తులో తెలియనట్లు తెలుస్తోంది. వాటి వెనుక నాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు కూడా చెబుతోంది. సిట్ గణాంకాలు చూస్తే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి స్పష్టం అవుతుంది. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన మొత్తం 165 మంది అభ్యర్థులలో ఏకంగా 160 మంది మార్కుల్లో అక్రమ మార్పులు, చేర్పులు జరిగినట్లు సీట్ గుర్తించింది. అన్యాయం జరిగిందంటూ కోర్టుకు ఎక్కిన 405 మంది అర్హులైన పిటీషనర్ల ఓఎంఆర్ సీట్లలోనూ మార్కులు తగ్గించేసి.. వారి అవకాశాలను తొక్కేసినట్లు కూడా గుర్తించింది. జవాబు పత్రాల్లో వైట్ కరెక్షన్ వాడడం, మార్కుల కోసం కొత్తగా బార్కోడ్ సీట్లు ముద్రించడం వంటి చర్యలు వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ఇవి విచారణలో తేలినట్లు సమాచారం. అప్పట్లో ఇదో వ్యవస్థీకృత నేరంగా విస్తరించినట్లు సిట్ గుర్తించింది.
* డీఎస్సీ పై రచ్చ..
ప్రస్తుతం డీఎస్సీ 2025 పై విష ప్రచారం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. అయితే కోర్టుకు ఆధారాలు సమర్పించలేదు. కేవలం అనుమానాలతోనే రచ్చ చేస్తోంది. ఇప్పుడు అదే వైసిపి హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు సీట్ ఆధారాలు తో సహా ఆరోపిస్తోంది. మరి దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.