Homeఆంధ్రప్రదేశ్‌DSC Protests: వైసీపీ ర్యాలీలకు విద్యార్థులు.. గట్టిగా ఇచ్చిపడేసిన ఓ తండ్రి!

DSC Protests: వైసీపీ ర్యాలీలకు విద్యార్థులు.. గట్టిగా ఇచ్చిపడేసిన ఓ తండ్రి!

DSC Protests: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలు భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. కానీ వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపలేకపోతోంది. దీనిపై కోర్టులు సైతం పిటిషన్లు కొట్టివేసాయి. అయినా సరే వైసిపి ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. అయితే ఈ ఆందోళనలకు డీఎస్సీ అభ్యర్థులు ముఖం చాటేయడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులను తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి ప్రిన్సిపాల్ […]

DSC Protests: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలు భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. కానీ వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపలేకపోతోంది. దీనిపై కోర్టులు సైతం పిటిషన్లు కొట్టివేసాయి. అయినా సరే వైసిపి ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. అయితే ఈ ఆందోళనలకు డీఎస్సీ అభ్యర్థులు ముఖం చాటేయడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులను తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి ప్రిన్సిపాల్ ను నిలదీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి.

* కడప జిల్లాలో అలా..
కడప జిల్లాలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన విద్యార్థులను..డీఎస్సీ 2025 ఆందోళనకు పంపించిన సంగతి తెలిసిందే. దీనిపై పులివెందుల టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ తో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు.. ప్రైవేటు కాలేజీ విద్యార్థులను పంపించడం ఏంటని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఇలా పంపించమని చెప్పిన వారిపై కేసులు పెట్టాలని కూడా చెప్పారు. కాలేజీలో పని చేస్తున్న అధ్యాపకులతో 2025 డీఎస్సీకి మద్దతుగా ర్యాలీ తీయాలని కూడా సూచించారు. అది మరవకముందే ఓ విద్యార్థిని తండ్రి వైసిపి ఆందోళనలకు తన కుమార్తెను పంపించడం పై తీవ్రంగా హెచ్చరించారు. గంజాయి బ్యాచ్ చేసే ర్యాలీకి తన కుమార్తెను పంపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అంటూ ప్రిన్సిపాల్ ను నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

* విద్యార్థుల తరలింపు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న దగాడిఎస్సి కార్యక్రమానికి పెద్దగా స్పందన లేకుండా పోతోంది. ఈ తరుణంలో ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తమౌతోంది తల్లిదండ్రుల నుంచి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మత్తులో యువకులు పోలీసులపై తిరగబడుతున్నారు. వారి మూలాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు ఆందోళనలు అంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఆపై వైసీపీ ఆధారాలు లేకుండానే డీఎస్సీ 2025 పై ఆరోపణలు చేస్తోంది. ఇది కూడా తల్లిదండ్రుల్లో ఆగ్రహానికి ఒక కారణం. మరోవైపు విద్యార్థులు రానిచోట పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారన్న కూటమినేతల ఆరోపణలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అయితే వైసిపి విద్యార్థులతో చేపడుతున్న ఆందోళన తల్లిదండ్రుల నుంచి విమర్శలకు కారణం అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by B1 Media (@b1mediatelugu)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper