Homeఆంధ్రప్రదేశ్‌Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు. జైలు తప్పనిసరి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్లు తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజు ల అరెస్టు తప్పేలా లేదు. ఆ ఇద్దరు నేతలు తమ వ్యక్తిగత వ్యవహార శైలితోనే కేసులు తెచ్చుకున్నారు. దొంగ పత్రాలు సృష్టి, భూ […]

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు. జైలు తప్పనిసరి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్లు తమ్మినేని సీతారాం, సిదిరి అప్పలరాజు ల అరెస్టు తప్పేలా లేదు. ఆ ఇద్దరు నేతలు తమ వ్యక్తిగత వ్యవహార శైలితోనే కేసులు తెచ్చుకున్నారు. దొంగ పత్రాలు సృష్టి, భూ కబ్జాలు, బెదిరింపులు వంటి తీవ్రమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యి.. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వీరి అరెస్టుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా దూకుడుగా వ్యవహరించి రాజకీయ సెంటిమెంట్కు అవకాశం ఇవ్వడం లేదు.

* అప్పట్లో అర్ధరాత్రి అరెస్టులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అర్థరాత్రి అరెస్టుల పర్వం ఆ పార్టీకి ఎంత ఇబ్బందులు తెచ్చిపెట్టిందో కూటమికి తెలియంది కాదు. అందుకే ఈ అరెస్టుల విషయంలో కూటమి ప్రభుత్వం ఒక పక్కా పద్ధతితోనే వెళ్తోంది. రాత్రికి రాత్రి అరెస్టులు జరిపితే రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. వారికి చట్టపరంగా అవకాశం కల్పించి.. వారు చేసిన తప్పిదాలను పక్కా ఆధారాలతో చూపించి.. చివరకు అరెస్టుల పర్వాలేదు అన్నది ప్రభుత్వాలు. మరోవైపు పోలీస్ శాఖకు సైతం ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి అరెస్టుల విషయంలో గాబర పడవద్దని..

* చివరకు అదుపులోకి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చట్టపరమైన మార్గాలను వినియోగించుకున్న తర్వాత.. కోర్టుల నుంచి ఎటువంటి రక్షణ, ఉపశమనం లభించని పరిస్థితుల్లో మాత్రమే అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నారు. న్యాయస్థానాల్లో కూడా కేసు నిలబడడంతో పాటు చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటున్నామని సందేశం ప్రజల్లోకి వెళుతోంది.. ఉద్దేశపూర్వక వేధింపులు కాదని.. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం పరిధిలోకి తెస్తున్నారనే విషయం స్పష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ వ్యూహం అమలు చేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper